Sridevi Shoban Babu Trailer: కుమార్తె కోసం చిరంజీవి సాయం - 'శ్రీదేవి శోభన్ బాబు'కు అండగా ఆచార్య 

కుమార్తె కోసం చిరంజీవి ఓ సాయం చేస్తున్నారు. 'శ్రీదేవి శోభన్ బాబు'కు అండగా 'ఆచార్య' రంగంలోకి దిగారు.

Continues below advertisement

'శ్రీదేవి శోభన్ బాబు' (Sridevi Shoban Babu)కు అండగా 'ఆచార్య' నిలబడ్డారు. పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించిన సినిమాను ప్రమోట్ చేయడానికి మెగాస్టార్ ముందుకు వచ్చారు. 'శ్రీదేవి శోభన్ బాబు' ట్రైలర్‌ను 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో విడుదల చేయనున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

సంతోష్ శోభన్ (santosh sobhan) హీరోగా, '96' ఫేమ్ గౌరీ జి. కిషన్ (gouri g kishan) హీరోయిన్‌గా గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మెగా డాటర్ సుస్మితా కొణిదెల, విష్ణు ప్రసాద్ దంపతులు నిర్మిస్తున్న సినిమా 'శ్రీదేవి శోభన్ బాబు'. ఈ చిత్రానికి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత టీజర్‌ను విడుదల చేశారు. శనివారం 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో ట్రైలర్ విడుదల చేయనున్నట్టు తెలిపారు.

''మరికొన్ని విశేషాలతో మా శ్రీదేవి, శోభన్ బాబును ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమైన సిద్ధ (రామ్ చరణ్), మన ఆచార్య (చిరంజీవి). ఇది మా చిత్ర బృందానికి మెగా సంబరం" అని గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ట్వీట్ చేసింది. 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం మెగాభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ వేడుకలో 'శ్రీదేవి శోభన్ బాబు' ట్రైలర్ విడుదల చేస్తే మంచి రీచ్ ఉంటుంది. 

Also Read: డీ - గ్లామర్ రోల్‌లో కీర్తీ సురేష్, టీజర్‌లో ఇంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందో?

Also Read: హీరో కార్తికేయ కొత్త సినిమాలో సిరివెన్నెల ఆఖరి పాట - షూటింగ్ షురూ

 

Continues below advertisement
Sponsored Links by Taboola