Sridevi Drama Company Latest Promo : ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ లో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఒకటి. ఈ షో కి బుల్లితెర ఆడియన్స్ లో విపరీతమైన ఆదరణ ఉంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోలో జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీస్ సందడి చేస్తుంటారు. ఇక ఆడియన్స్ కి ప్రత్యేక వినోదాన్ని అందించేందుకు నిర్వాహకులు ప్రతివారం సరికొత్త థీమ్ తో షోని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సాగనుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమో ఆడియన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది.


ముఖ్యంగా ప్రోమోలో పల్సర్ బైక్ సింగర్ రమణ తన భార్యతో కలిసి రావడం, వాళ్ళిద్దరూ స్టేజ్ పై పెర్ఫార్మ్ చేయడం హైలైట్ గా నిలిచింది. 'కొత్తజంట' అనే పేరుతో ఈ వారం ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. ఇందులో రీల్ జోడీలు Vs రియల్ జోడీలు పార్టిసిపేట్ చేశారు. వాళ్లంతా కలిసి డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. రష్మి వాళ్ళతో సరదా గేమ్స్ కూడా ఆడించారు. ఇక ప్రోమోని పరిశీలిస్తే.. రాంప్రసాద్, హైపర్ ఆది ఎంట్రీ తో ప్రోమో స్టార్ట్ అయింది. 'నా ఎపిసోడ్ లో నువ్వెచ్చావ్ ఏంటి?' అని రాంప్రసాద్ ఆదిని అడిగితే..' నీకోసం ఎర అయినా అవుతా, సొర అయినా అవుతా' అంటూ సలార్ డైలాగ్ చెప్పాడు ఆది. ఇమ్మానుయేల్, నూకరాజు, ఫైమా కొత్తజంటలతో స్టేజి పైకి వచ్చారు.


దాంతో రాంప్రసాద్ వాళ్ల పాత జంటల గురించి అడిగాడు.' 2024 లో కొత్త జంట, వీడే నా లవర్ రాజు' అంటూ ఫైమా అంటుంది. ఆ తర్వాత అన్ని జోడీలు కలిసి తమ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసారు. అనంతరం రేష్మి వాళ్లతో  ఫన్నీ గేమ్స్ ఆడించారు. ఇదంతా ఒకెత్తు అయితే ఈ ఎపిసోడ్లో పల్సర్ బైక్ సింగర్ రమణ తన భార్యతో కలిసి సందడి చేయడం మరో ఎత్తు. ప్రోమోలో రమణ సాంగ్ పాడుతుంటే పక్కనే తన భార్య డాన్స్ చేస్తూ సందడి చేసింది. ఆ తర్వాత రమణ భార్య కుందనాశ్రీతో రష్మీ "మీ ప్రేమ చెప్పుకోవాలంటే ఎలా చెప్తావ్" అని అడిగింది.


"తానొక ఆర్టిస్ట్ అని మా పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోలేదు. మా వాళ్ళు అన్న మాటలకు అతని ప్లేస్ లో ఇంకా ఎవరైనా ఉండి ఉంటే డ్రాప్ ఐపోయేవాళ్లు. మా వాళ్ళు అన్న మాటల్నే కాదు నన్ను కూడా చాలా భరించారు. అందుకు థ్యాంక్స్ అండ్ లవ్ యు" అంటూ చెప్పింది. దాంతో రమణ వెళ్లి తన భార్య నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంద్రజతో పాటూ శ్రీదేవి డ్రామా కంపెనీ టీం మొత్తం వాళ్ళను స్టేజి మీద కూర్చోబెట్టి చీరా సారె పెట్టి నూతన జంటను ఆశీర్వదించారు. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ జనవరి 28 ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈటీవీలో ప్రసారం కానుంది.


Also Read : దాని వల్ల లైఫ్‌లో కొన్ని కోల్పోవల్సి వస్తుంది, వరుణ్‌కు ఓసీడీ ఉంది: లావణ్య త్రిపాఠి