శ్రీదేవి ఆపళ్ళ... నాని నిర్మించిన 'కోర్ట్' సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అమ్మాయి. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా... 'కోర్ట్' ఎక్కువ గుర్తింపు తెచ్చింది. అనూహ్యంగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. మెడలో దండ, పక్కన హ్యాండ్సమ్ యువకుడు ఉండటంతో అది పెళ్లి ఫోటో అనుకున్న జనాలు ఎక్కువ మంది ఉన్నారు. అయితే... అసలు నిజం వేరే ఉంది. 

పెళ్లి కాదు... సినిమా ఓపెనింగ్!శివ కార్తికేయన్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన హిట్ సినిమా 'డాక్టర్' గుర్తు ఉందా? ఆ తర్వాత 'అయలాన్' గుర్తు ఉందా? ఆ రెండు సినిమాలకు నిర్మాత కేజేఆర్. ఆ రెండిటికీ ముందు ఐదారు సినిమాలు చేశారు.

నిర్మాతగా విజయాలు అందుకున్న కేజేఆర్, ఇప్పుడు కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'గుర్తింపు'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇదొక స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా. తొలి సినిమా సెట్స్ మీద ఉండగా రెండో సినిమా స్టార్ట్ చేశారు. చెన్నైలో సోమవారం హీరోగా కేజేఆర్ రెండో సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అందులో శ్రీదేవి ఆపళ్ళ హీరోయిన్. 

తమిళ చిత్ర పరిశ్రమలో కొత్త సినిమా ప్రారంభం అయినప్పుడు నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల మెడలో పూల దండలు వేయడం ఆనవాయితీ. అలాగే కేజేఆర్, శ్రీదేవి ఆపళ్ళ మెడలో దండలు వేశారు. ఆ ఫోటోలు చూసి చాలా మంది పెళ్ళి ఫోటో అనుకున్నారంతా.

Also Readరాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న... బాలకృష్ణుడిగా జక్కన్న... శివ‌శ‌క్తి ద‌త్తా దర్శకత్వంలో ఆగిపోయిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఏదో తెలుసా?

కేజేఆర్, శ్రీదేవి ఆపళ్ళ జంటగా నటించనున్న సినిమాను ఇటీవల 'మార్క్ ఆంటోనీ' ప్రొడ్యూస్ చేసిన మినీ స్టూడియో సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. ఆ సంస్థలో ప్రొడక్షన్ నెం. 15 ఇది. తెలుగులో గంగా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమా విడుదల చేయనుంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండ్య రాజన్ శిష్యుడు రెగన్ స్టానిస్లాస్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలు పెడతామని దర్శక నిర్మాతలు చెప్పారు.

Also Readపాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు... స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ లిస్ట్ ఇదిగో

ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సింగం పులి, జయ ప్రకాష్, హరీష్ కుమార్, పృథ్వీ రాజ్, ఇందుమతి, అశ్విని కె. కుమార్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, అజువర్గీస్, శ్రీకాంత్ మురళి తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం: పి.వి. శంకర్, నిర్మాత: ఎస్. వినోద్ కుమార్.