Rashmika Mandanna's Stunning Look For Dirty Magazine: ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్తోన్న హీరోయిన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన్న. రీసెంట్‌గా 'కుబేర'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె తన కొత్త మూవీ 'మైసా'లో షాకింగ్ లుక్‌తో  హైప్ క్రియేట్ చేశారు. ముఖం నిండా రక్తం, చేతిలో ఆయుధంతో వారియర్ లుక్‌లో ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో ఓ కొత్త రోల్‌లో కనిపించనున్నారు. 

స్టన్నింగ్ లుక్ ఫర్ మ్యాగజైన్

నేషనల్ క్రష్ మరోసారి స్టన్నింగ్, హై ఫ్యాషన్ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. డర్టీ మ్యాగజైన్ 'డర్టీ కట్ 2025' కోసం ఎవరూ గుర్తించలేని విధంగా హై ఫ్యాషన్డ్, స్టైలిష్, కర్లీ హెయిర్‌తో షాక్ ఇచ్చారు. దీన్ని తన ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఈ లుక్ చూసిన నెటిజన్లు అసలు ఆమె రష్మికనేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మీమ్స్‌తో ట్రోలింగ్స్

కొందరు రష్మిక లుక్ బాగుందంటూ కామెంట్ చేస్తుండగా... కొందరు మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. 'మల్లన్న సినిమాలో హీరోయిన్ శ్రియ లుక్'లా ఉందంటూ ఒకరు చెప్పగా... రష్మిక నీకు ఏమైంది అంటూ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. నేషనల్ క్రష్ ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్ సూపర్ అని... గుర్తుపట్టలేనట్టుగా ఉన్నా హై ఫ్యాషన్‌గా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.

Also Read: భారీ ధరకు చిరు, అనిల్ రావిపూడి మూవీ ఓటీటీ డీల్? - మెగాస్టార్ మూవీ అంటే అట్లుంటది మరి

ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌తో

సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది రష్మిక వరుస హిట్లతో దూసుకెళ్లారు. పుష్ప 2, యానిమల్, ఛావాతో పాటు కుబేర మూవీ సైతం రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఇదే జోష్‌తో ఆమె ఫీమేల్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రీసెంట్‌గా అనౌన్స్ చేసిన 'మైసా' మూవీ అదే జానర్‌లోకి వస్తుంది.

ఈ మూవీ రష్మిక ప్రీ లుక్, ఫస్ట్ లుక్ చూడగానే అటు సెలబ్రిటీలతో పాటు ఇటు ఫ్యాన్స్ సైతం ఒక్కసారిగా షాకయ్యారు. అసలేంటి 'మైసా' అంటూ సోషల్ మీడియాలో తెగ వెతికారు. ఈ టైటిల్ స్వీడిష్, అరబిక్, జార్జియన్, జపనీస్ మూలాల నుంచి తీసుకున్నట్లు తెలుస్తుండగా... 'మైసా' అంటే అమ్మ అని అర్థం. వారియర్ మదర్‌గా కనిపించనున్నందునే ఈ పేరు పెట్టారని సమాచారం.

ఈ సినిమాను అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తుండగా... రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. గోండు తెగల బ్యాక్ డ్రాప్ ప్రధానాంశం అని తెలుస్తుండగా... ఆ తెగలకు అండగా ఓ వారియర్‌గా ఆమె ఏం చేశారనేది ఆసక్తిగా మారనుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి వివరాలు వెల్లడి కానున్నాయి. వీటితో పాటే 'ది గర్ల్ ఫ్రెండ్', బాలీవుడ్‌లో థామా మూవీ చేస్తున్నారు.