Bhaag Saale Release Date : వెరైటీ కథలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకులలో ఒకరు శ్రీ సింహ కోడూరి (Sri Simha Koduri). ఆయన నటించిన లేటెస్ట్ సినిమా 'భాగ్ సాలే'.  కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. జూలై 7న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు దర్శక, నిర్మాతలు వెల్లడించారు.


ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా తెరకెక్కిన్న 'భాగ్ సాలే' సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. తాజాగా విడుదలకు రెడీగా ఉందంటూ చిత్ర నిర్వాహకులు ఈ ఇంట్రస్టింగ్ న్యూస్ ను ప్రకటించారు. దీంతో పాటు సినిమాలో శ్రీ సింహ క్యారెక్టర్ ను చూపే ఓ క్రేజీ ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ ఫొటోలో శ్రీ సింహ.. ఓ స్ట్రీట్ లో పరుగెడుతూ కనిపించారు. ఇది ఫైట్ సీన్ ను తలపించేలా ఉంది. హీరో ఎంట్రీ లేదంటే క్లైమాక్స్ సన్నివేశాలకు సంబంధించిన ఫోటో అయి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.


ఈ సినిమాకు సంబంధించి గతేడాది అక్టోబర్ లో టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమాలో శ్రీ సింహ సరసన నేహా సొలంకి (Neha Solanki) హీరోయిన్ గా నటించింది. జాన్ విజయ్, నందిని రాయ్ ఈ మూవీలో విలన్ రోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా బ్యానర్లపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు.


అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉంటుందని 'భాగ్ సాలే' మేకర్స్ ఇంతకు మునుపే వెల్లడించారు. కాగా ఈ సినిమాలో శ్రీ సింహతో పాటు నేహా సోలంకీ, రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సంగీతం కాల భైరవ అందిస్తుండగా, ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. 


Also Read : ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూలో కియారా అడ్వాణీ - రామ్ చరణ్ సినిమా తర్వాత!



ఇక శ్రీ సింహా కోడూరి విషయానికొస్తే.. దర్శక ధీరుడు కీరవాణి కుమారుడైన ఈయన.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమ దొంగ’ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్ పాత్రలో నటించారు. ఆ తర్వాత 'మర్యాద రామన్న'లోనూ బాలనటుడిగా యాక్ట్ చేశారు. ఇక జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈగ'లో కూడా (బిందు) సమంత ఫ్రెండ్ పాత్రలో నటించారు. ‘మత్తు వదలరా’ సినిమాతో 2019లో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందర్నీ థ్రిల్ చేశారు. ఆ తర్వాత ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాలతో పలకరించిన ఆయన... ఇప్పుడు ‘బాగ్ సాలే’ మూవీతో రాబోతున్నారు.


Read Also : Upasana - Handcrafted Cardle : ఉపాసనకు బహుమతిగా ఊయల - తయారీలో అందరూ మహిళలే