ఇండియన్ సినిమా ప్రైడ్ కీరవాణి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు ‘శ్రీ సింహా కోడూరి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘యమదొంగ’, ‘మర్యాద రామన్న’ సినిమాల్లో నటించిన శ్రీ సింహా ‘మత్తు వదలరా’ సినిమాతో సోలో హీరోగా మారాడు. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టిన సింహా కోడూరి, ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. శ్రీ సింహా కోడూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. సాయి కొర్రపాటి, క్రిషీ ఎంటర్తైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని ఫనిదీప్ డైరెక్ట్ చేస్తున్నాడు.


ఫిబ్రవరి 23న సింహా కోడూరి పుట్టిన రోజు కావడంతో దర్శక నిర్మాతలు ‘ఉస్తాద్’ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. “Meet the fearless pilot who overcame turbulence to give wings to his dreams, from a small town to the sky. Happy birthday to our hero” అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సింహా కోడూరి, పైలట్ గా కనిపించాడు. త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఉస్తాద్ మూవీకి, ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ ప్రమోషన్స్ కి కిక్ ఇచ్చింది. మరి తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త సినిమాలతో ఆశించిన స్థాయిలో అట్రాక్ట్ చెయ్యలేకపోయిన శ్రీ సింహా కోడూరి ‘ఉస్తాద్’ సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి.


కీరవాణి వారసుడిగా వచ్చిన సింహా కోడూరి. సంగీతంలో కాకుండా నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ‘మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అతను ‘తెల్లవారితే గురువారం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఉస్తాద్’ సినిమా కంటే ముందు అతను నటించిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం తెలుగు తెరకు ఒక సరికొత్త జోనర్‌ని పరిచయం చేసింది. సెప్టెంబర్‌ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే థియేటర్లలో పెద్దగా ఈ థ్రిల్లర్‌ సినిమా ఆకట్టుకోలేదనే చెప్పాలి.


Read Alos: హాలీవుడ్ టాప్ హీరోలకే చెమటలు పట్టిస్తున్న చెర్రీ, తారక్ - ఆ అవార్డుల్లో 2 కేటగిరీల్లో నామినేషన్స్


ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకొని విడుదల చేసింది. దీంతో అక్టోబర్‌ 7వ తేదీ నుంచి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మెర్సిడెస్ బెంజ్ SUVలో చిక్కుకున్న దొంగ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. సతీష్ త్రిపుర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి అస్రాని కథానాయికగా నటించింది. కాల భైరవ స్వరాలు సమకూర్చారు. అయితే ఇక్కడ కూడా ఊహించిన రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోలేదు హీరో. మరి కొత్త సినిమాతో అయినా తన ఫేట్ మారాలని చాలా మంది ఆశిస్తున్నారు. 


‘తెల్లవారితో గురువారం’ సినిమా కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. హీరోహీరోయిన్ల పాత్ర వరకూ నటన బాగుందనే చెప్పాలి. వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే సత్య, వైవా హర్షల పాత్రలతో నవ్వించడానికి ప్రయత్నం చేశారు. మనకు నవ్వు వచ్చిందా లేదా అన్నది తర్వాతి విషయం. ప్రథమార్థం వరకూ కథను వేగంగానే నడిపినా సెకండాఫ్ లో మందగించింది. మధుకు పెళ్లి ఎందుకు ఇష్టంలేదో దర్శకుడు కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు. అదే మరో హీరోయిన్ విషయంలోనూ కనిపిస్తుంది. ఎలాంటి కథనైనా ఆసక్తిగా మలచగలగాలి. అది లోపించడం వల్లే సినిమా గాడి తప్పింది. మరి ఇప్పుడు ‘ఉస్తాద్’ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.