Sri Kalahasti Song From Kannappa Released: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి మరో సాంగ్ వచ్చేసింది. 'శ్రీకాళహస్తి' మహత్యాన్ని వివరించేలా ఈ పాటను మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఆలపించారు. కొండ ప్రాంతంలో గిరిజనులకు శివయ్య, శ్రీకాళహస్తి మహత్యాన్ని వివరిస్తూ వీరు ఆలపించిన తీరు ఆకట్టుకుంటోంది.

శ్రీకాళహస్తి గాథ..

'జనులారా వినరారా.. కాళహస్తి గాథ.. శ్రీకాళహస్తి గాథ.. కనులారా మనసారా కనిన జన్మ ధన్యమే కదా.. ఈ కథ..' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సుద్దాల అశోక్ తేజ పాటకు లిరిక్స్ అందించగా.. స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందించారు. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: గుణశేఖర్ 'యుఫోరియా' మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ - ఇంపార్టెంట్ రోల్ రివీల్ చేసిన టీం.. ఎవరంటే?

హార్డ్ డిస్క్ మిస్సింగ్.. టీం రియాక్షన్..

ఓ వైపు 'కన్నప్ప' ప్రమోషన్లలో భాగంగా మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంతలోనే మూవీ టీంకు షాక్ తగిలింది. మూవీకి సంబంధించి కీలక హార్డ్ డిస్క్ మిస్ అయ్యింది. దీంతో నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అవేదన వ్యక్తం చేసింది. ప్రభాస్‌కు సంబంధించి భారీ సీన్స్ అందులోనే ఉన్నాయని.. 90 నిమిషాల ఫుటేజీని ఆన్‌లైన్‌లో లీక్ చేసే కుట్ర జరుగుతోందని తెలిపింది. 'ముంబయిలోని 'హైవ్' స్టూడియోస్ నుంచి మా కార్యాలయానికి వస్తుండగా హార్డ్ డిస్క్ చోరీ చేశారు. అందులో రెండు రోల్స్‌కు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్, వీఎఫ్ఎక్స్ విజువల్స్ ఉన్నాయి.

చరిత అనే మహిళ సూచనల మేరకు రఘు అనే వ్యక్తి ఆ పార్శిల్ సంతకం చేసి తీసుకున్నాడు. వారిద్దరూ సంస్థ ఉద్యోగులూ కాదు, ప్రతినిధులు కాదు. ఈ ఘటనపై 4 వారాల క్రితమే కంప్లైంట్ చేశాం. దీని వెనుక ఉన్న వారి గురించి పోలీసులకు అందించాం.' అని తెలిపింది. బ్యాకప్ ఉన్నప్పటికీ డేటా లీకైతే పెద్ద నష్టమే జరుగుతుందని టీం చెబుతోంది.

మూవీ టీం రిక్వెస్ట్..

ఇండస్ట్రీ వ్యక్తులే ఇలా చేస్తుండడం బాధాకరమని మూవీ టీం తెలిపింది. 'తెలుగు సినిమా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న వేళ.. ఇలాంటి పరిణామాలు అవమానకరం. ఇలాంటి పిరికిపంద చర్యలకు మేం భయపడం. సత్యమే గెలుస్తుందన్న నమ్మకం ఉంది. ఒకవేళ ఏదైనా పైరేటెడ్ కంటెంట్ కనిపిస్తే.. దాన్ని ప్రోత్సహించొద్దు.' అంటూ విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మంచు విష్ణు ఆవేదన

ఈ ఘటనపై మంచు విష్ణు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. 'జటాజూటధారీ, నీ కోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామి!' అంటూ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. 

ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.