Sreeleela Shooting Break: నటీనటులు ఎంతవరకు చదువుకున్నారు, అసలు వారి క్వాలిఫికేషన్ ఏంటి అని విషయాలను చాలామంది ప్రేక్షకులు పట్టించుకోరు. కానీ నటీనటులుగా మారిన తర్వాత కూడా ఇతర వృత్తులపై ఫోకస్ చేసేవారు, ఇంకా బాగా చదువుకొని వేరే నటనతో పాటు వేరే ప్రొఫెషన్‌లో సెటిల్ అవ్వాలి అనుకునేవారు కూడా ఉంటారు. ఇప్పటికీ పలువురు నటీనటులు డాక్టర్స్‌గా సర్టిఫికెట్‌ను సంపాదించడంతో పాటు యాక్టింగ్‌లో కూడా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. ఆ లిస్ట్‌లో శ్రీలీల కూడా జాయిన్ అయ్యింది. ప్రస్తుతం తన చదువుపై ఫోకస్ పెట్టడానికి.. ఈ బిజీ హీరోయిన్ కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని సమాచారం.


తాత్కాలికంగా బ్రేక్..
ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ ఎవరు అంటే చాలామంది ప్రేక్షకులు శ్రీలీల పేరే చెప్తారు. మామూలుగా ఎంత బిజీగా ఉన్న హీరోయిన్స్ అయినా సినిమాల కోసం రోజులవారీగా కాల్ షీట్స్‌ను కేటాయిస్తారు. కానీ శ్రీలీల మాత్రం గత కొన్నినెలలుగా ఉదయం ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంటే.. మధ్యాహ్నం మరో సినిమా షూటింగ్‌కు షిఫ్ట్ అవుతోంది. రాత్రి మరొక షూటింగ్ లొకేషన్‌కు వెళ్లిపోతోంది. ఇలా కొన్ని నెలలుగా తనకు అసలు షూటింగ్ నుంచి రెస్టే దొరకడం లేదు. ఫైనల్‌గా తన చదువుపై దృష్టిపెట్టడానికి కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండనుందట ఈ ముద్దుగుమ్మ. అంటే షూటింగ్స్‌ నుంచి తాత్కాలికంగా బ్రేక్ తీసుకోనుందని తెలుస్తోంది.


రెండూ ముఖ్యమే..
ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి శ్రీలీల వెళ్తుందని, ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు.. అంటే వారం రోజుల పాటు షూటింగ్స్‌కు దూరంగా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి శ్రీలీల.. ఇలాంటి తాత్కాలిక బ్రేక్స్ ఎన్నో తీసుకుంటూనే ఉంది. ఎప్పుడూ షూటింగ్స్‌లోనే బిజీగా ఉండే ఈ అమ్మాయి.. అసలు ఎప్పుడు చదువుకుంటుంది అని ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో హీరోయిన్‌గా తన కెరీర్ ఎంత ముఖ్యమో.. ఎంబీబీఎస్ కూడా తనకు అదే ముఖ్యమని, తనకు రెండూ సమానమే అని శ్రీలీల ఇప్పటికే పలుమార్లు బయటపెట్టింది.


‘గుంటూరు కారం’లో మహేశ్‌కు జోడీగా..
ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’లో హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీలీల. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. తనతో కొన్నిరోజులు షూటింగ్ కూడా జరిగింది. అదే సమయంలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ పాత్రకు ఎంపికయ్యింది. కానీ పూజా హెగ్డే ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి శ్రీలీల వచ్చింది. సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసింది మూవీ టీమ్. ఇప్పటికే శ్రీలీల, మహేశ్ బాబు పెయిర్ చాలా ఫ్రెష్‌గా ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఓ మై బేబీ’ అనే పాట కూడా విడుదలయ్యి మిక్స్‌డ్ రివ్యూలు అందుకుంటోంది.. ఇదిలా ఉండగా.. తన డ్యాన్స్‌తో ఆడియన్స్ అందరినీ ఫిదా చేసిన శ్రీలీల.. స్క్రిప్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని, ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఎంచుకుంటే తన కెరీర్‌కు మంచిది అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.


Also Read: ‘కేజీయఫ్’ కనెక్షన్, ‘బాహుబలి 3’ అప్‌డేట్ - ‘సలార్’ టీమ్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ ప్రోమో!