ప్రతి సినిమానూ పైరసీ భూతం వెంటాడుతోంది. రిలీజ్ డే థియేటర్లలో‌ షోలు పడిన కొన్ని గంటలకు నెట్టింట హెచ్‌డి ప్రింట్ కనపడేది.‌ కానీ, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సింగిల్'కు మాత్రం మొదటి రోజు పైరసీ‌ ప్రింట్ కనపడలేదు. దీని వెనుక నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.

సింగపూర్, గల్ఫ్...సినిమా రిలీజ్ స్కిప్ చేశారు!తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ గత కొన్నాళ్లుగా కీలకంగా మారింది. అమెరికా, కెనడా దేశాలతో పాటు మన తెలుగు ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న ఆస్ట్రేలియా, సింగపూర్, గల్ఫ్ దేశాలలో కూడా సినిమాలను విడుదల చేస్తున్నారు. 'సింగిల్' సినిమా కూడా ఓవర్సీస్ ఏరియాలలో విడుదల అయింది. అయితే...

'సింగిల్' సినిమాకు అమెరికాలో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ మిగతా ఓవర్సీస్ దేశాలలో అంతగా రావడం లేదు. ఎందుకో తెలుసా? గల్ఫ్, సింగపూర్ వంటి దేశాలలో సినిమా విడుదల చేయలేదు.‌ నార్త్ ఇండియాలో, దేశ రాజధాని ఢిల్లీ వంటి నగరాలలో కూడా సినిమాను సరిగా విడుదల చేయలేదు. 

సింగపూర్, గల్ఫ్ దేశాలతో పాటు నార్త్ ఇండియాలో కొన్ని సెంటర్స్ నుంచి సినిమా పైరసీ అవుతోందనే అనుమానం టాలీవుడ్ నిర్మాతలలో ఉంది. అనుమానం ఉన్న ఏరియాల్లో 'సింగిల్' సినిమా విడుదల చేయలేదు. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్ల అనుమానం నిజం అయ్యింది. గల్ఫ్, సింగపూర్ దేశాలలో రిలీజ్ స్కిప్ చేయడం వల్ల ‌విడుదలైన కొన్ని గంటలలో ఆన్‌లైన్‌లో, నెట్టింట క్వాలిటీతో కూడిన పైరసీ ప్రింట్ రాలేదు. థియేట్రికల్ ప్రింట్ మాత్రమే వచ్చింది. అందులో సరిగా డైలాగులు వంటివి వినపడకపోవడంతో పాటు పిక్చర్ క్వాలిటీ కూడా లేదు కనుక ఎఫెక్ట్ పడలేదు.

Also Readహరికృష్ణ మనవడి సినిమా.... అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎందుకు ట్వీట్ చేయలే?

నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నా...వీకెండ్ తర్వాత పైరసీ వచ్చేసింది!పైరసీని అరికట్టడం కోసం 'సింగిల్' సినిమా నిర్మాతలు చేసిన కృషిని అభినందించాలి. మొదటి రోజు కొన్ని ఏరియాలలో నుంచి వచ్చే ఓపెనింగ్స్ వదిలేసుకున్నారు. కొన్ని ప్రాంతాలలో సినిమాలు విడుదల చేయలేదు. మొదటి రెండు మూడు రోజులు ఆ ప్రభావం కనిపించింది. నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీకెండ్ వచ్చేసరికి క్వాలిటీతో కూడిన పైరసీ ప్రింట్ వచ్చేసింది. సాధారణంగా వీకెండ్ తర్వాత వసూళ్లు కొంచెం తగ్గుతాయి. దానికి తోడు పైరసీ ప్రింట్ రావడం వల్ల థియేటర్లలో స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.

శ్రీ విష్ణు సరసన కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన 'సింగిల్' సినిమాలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు.‌ సినిమాలో కామెడీకి మంచి పేరు వచ్చింది.

Also Read: తమిళ దర్శకుడితో నాగార్జున వందో సినిమా... టైటిల్ అదేనా?