Sree Vishnu's Mrithyunjay New Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 28న 'విష్ణు విన్యాసం' కూడా రిలీజ్ అవుతుండడంతో ఒకేసారి రెండు మూవీస్ రాకుండా ఈ మూవీ వారం వెనక్కు వెళ్లింది.

Continues below advertisement

న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ఈ నెల 27న 'మృత్యుంజయ్' రిలీజ్ కావాల్సి ఉండగా వారం వాయిదా వేసినట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మార్చి 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీకి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తుండగా... శ్రీవిష్ణు సరసన రేబా మోనికా హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'సామజవరగమన' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరి కాంబో రిపీట్ అవుతుండడంతో సూపర్ క్రేజ్ నెలకొంది.

Continues below advertisement

శ్రీవిష్ణు, రేబా మోనికాలతో పాటే సుదర్శన్, రచ్చ రవి, సిజ్జు, అయ్యప్ప, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రమ్య గున్నం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి చిత్రాన్ని నిర్మించారు.

Also Read : ప్రభాస్ ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా? - ఆ స్టార్ డైరెక్టర్‌కు డార్లింగ్ బిగ్ ఫ్యాన్