ఫాంటసీ హారర్ సినిమా 'ది రాజా సాబ్'తో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas)కు షాక్ తగిలింది. బాక్స్ ఆఫీస్ బరిలో ఆ సినిమాకు ఆశించిన రిజల్ట్ రాలేదు. ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయినా... నెక్స్ట్ హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మీద నమ్మకం పెట్టుకున్నారు. 'ది రాజా సాబ్' ప్రమోషన్స్ కోసం 'స్పిరిట్' చిత్రీకరణకు కొంత విరామం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు ప్రభాస్ షాక్ ఇచ్చారని టాక్.

Continues below advertisement

సందీప్ రెడ్డి వంగా రిక్వెస్ట్ పక్కన పెట్టారా?'స్పిరిట్' కథను ప్రభాస్ ఎప్పుడో ఓకే చేశారు. అయితే సెట్స్ మీదకు సినిమా వెళ్లేందుకు సమయం పట్టింది. అందుకు కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ రిక్వెస్ట్. అది ఏమిటంటే?

Also Read: Om Shanti Shanti Shantihi: కపుల్స్‌కు తరుణ్ భాస్కర్ టీం బంపర్ ఆఫర్... ప్రీమియర్స్ వేసే థియేటర్స్ లిస్ట్‌

Continues below advertisement

'సాహో' తర్వాత నుంచి ప్రభాస్ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. నెలలో ఒక సినిమాకు కొన్ని రోజులు, మరో సినిమాకు ఇంకొన్ని రోజులు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ వచ్చారు. 'రాజా సాబ్' తీయడానికి మూడేళ్లు పట్టడానికి గల కారణాల్లో అదొకటి. తనకు అలా వద్దని, తన సినిమా చేసేటప్పుడు మరొక సినిమా చేయవద్దని, లుక్ పరంగా కంటిన్యుటీ ఉండాలని సందీప్ రెడ్డి వంగా రిక్వెస్ట్ చేశారు. అందుకోసం కొన్నాళ్ళు వెయిట్ చేశారు కూడా. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేసి 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ చేశారు ప్రభాస్. అయితే ముందు అనుకున్న విధంగా 'స్పిరిట్' పూర్తి అయ్యే వరకు ఆగకుండా మరొక సినిమా స్టార్ట్ చేస్తున్నారట. 

'స్పిరిట్'తో పాటు 'కల్కి 2' షూట్ కూడా!Kalki 2 Shooting Update: ఫిబ్రవరి 2వ తేదీ నుంచి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయే 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చారని తెలిసింది. అంటే... 'స్పిరిట్' ఫినిష్ చేయడానికి ముందు మరొక సినిమా స్టార్ట్ చేస్తున్నారన్నమాట. 

Also ReadAnil Ravipudi Vs Trivikram: అనిల్ రావిపూడి vs త్రివిక్రమ్... వెంకీకి 500 కోట్ల హిట్ ఇచ్చేది ఎవరు?

రెండు వారాలు 'కల్కి 2898 ఏడీ పార్ట్ 2' షూటింగ్ చేశాక... ఫిబ్రవరి 15 తర్వాత నుంచి 'స్పిరిట్'కు డేట్స్ ఇచ్చారట. ఇప్పుడు రెండు వారాలు ఒక సినిమా, మరో రెండు వారాలు ఇంకో సినిమా షూటింగ్ చేయాలని ప్రభాస్ డిసైడ్ కావడంతో సందీప్ రెడ్డి వంగాకు షాక్ తగిలిందనేది ఇండస్ట్రీ గుసగుస. అదీ సంగతి. మొత్తం మీద ప్రభాస్ మళ్ళీ షూటింగులకు హాజరు కావడం అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే అంశం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని 'సలార్ 2' సీక్వెల్ కూడా ప్రభాస్ చేయాలి. అదీ సంగతి.

Also ReadPoliticians Died In Flight Crash: తెలుగు నేతల్లో వైయస్సార్, బాలయోగి... విమాన ప్రమాదాల్లో మరణించిన జాతీయ రాజకీయ ప్రముఖులు ఎవరంటే?