Sonu Sood Calls Out Kangana Ranaut Over Crass Comments On Gen Z : జెన్ జీ నిరసనలపై బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన కాంట్రవర్సియల్ కామెంట్స్‌పై నటుడు సోనూ సూద్ రియాక్ట్ అయ్యారు. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలంటూ హితవు పలికారు.

Continues below advertisement

'అది చాలా సిగ్గుచేటు'

తొలుత తాను కంగనా చేసిన కామెంట్స్ వినలేదని చెప్పారు సోనూసూద్. యువతను ఉద్దేశించి గట్టర్ జనరేషన్ అనే పదాన్ని కంగనా వాడారంటూ విలేకరులు చెప్పగా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. 'కంగనా ఒకవేళ నిజంగా ఆ మాట అని ఉంటే అది చాలా సిగ్గుచేటు. అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. నోరు జారే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. నటులకు గుర్తింపు తెచ్చేది యువతే.

Continues below advertisement

వారు మీ వెన్నంటి ఉన్నంత వరకూ మాత్రమే మీరు ఎదుగుతారు. వారి సపోర్ట్ లేకుంటే మీకు కష్టమవుతుంది. కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలి. మన ప్రొఫెషన్ ఏదైనా ప్రజలతో మమేకమైనప్పుడే దాని ఓ అర్థం ఉంటుంది. ప్రజలే దేవుళ్లు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి.' అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read : Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

అసలేం జరిగిందంటే?

రీసెంట్‌గా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత నిరసనలను ఉద్దేశించి కంగనా సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'జెన్ జీ నిరసనకారుల రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయి. వారు మాట్లాడే విధానం, వాడే భాష నేనెప్పుడూ చూడలేదు. ఫ్రీడమ్‌ను యువత దుర్వినియోగంం చేస్తోంది. వీరు చదువుల్లో రాణించలేరు. వీరి వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు.' అంటూ కామెంట్స్ చేయగా ఇవి తీవ్ర దుమారం రేపాయి.

దీనిపై సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ రియాక్ట్ అయ్యారు. 'కనీసం సొంత పార్టీ నాయకులే కంగనా మాటలను సీరియస్‌గా తీసుకోరు. ఆమె కామెంట్స్‌ను నేటి తరం జెన్ జెడ్ ఎందుకు పట్టించుకుంటుంది? ఎంపీ పనంటే తక్కువ అనుకున్నానని, ఇంత పని ఉంటుందని ఊహించలేదని ఆమె గతంలో చేసిన కామెంట్సే ఆమె సీరియస్ నెస్ తెలియజేస్తున్నాయి.' అని విమర్శించారు.

కంగనా స్ట్రాంగ్ కౌంటర్

ఈ కామెంట్స్‌కు కంగనా కూడా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. 'నేను ఈ వ్యక్తి గురించి గూగుల్ చేశా. అతనికి 28 ఏళ్లు. ఇప్పటికీ స్టూడెంట్ అని ఎలా చెప్పుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేను పాలిటిక్స్‌లోకి వచ్చి రెండేళ్లే కావొచ్చు. కానీ గత 20 ఏళ్లుగా ప్రజల మధ్యే జీవిస్తున్నా. అతని వయసు నాకు ఉన్నప్పుడు నా చేతిలో అప్పటికే 2 నేషనల్ అవార్డులున్నాయి.' అని ఇన్ స్టాలో రాసుకొచ్చారు. తాజాగా ఈ వివాదంపై సోనూ సూద్ స్పందించారు.

Also Read : Azadi 501 Series OTT : ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.