Ajith Kumar fans: సినీ పరిశ్రమలో ఫ్యాన్ వార్స్ సహజం. ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరోను, తన సినిమాలను కించపరిచినట్టుగా మాట్లాడడం కామన్‌గా మారిపోయింది. ఇక కోలీవుడ్‌లో ఫ్యాన్ వార్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి. ఓవైపు అజిత్ ఫ్యాన్స్, మరోవైపు విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఏదో ఒక కారణం చేత గొడవలు పడుతూనే ఉంటారు. కానీ మొదటిసారి అజిత్ ఫ్యాన్స్ విజయ్‌కు అండగా నిలబడ్డారు. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరయిన విజయ్‌ను గుర్తుతెలియని వ్యక్తి చెప్పుతో కొట్టాడు. దీంతో ఈ స్టార్ హీరోకు ఘోరమైన అవమానం జరిగింది. అయితే దాని వెనుక ఎవరు ఉన్నారో కనిపెడతామని అజిత్ ఫ్యాన్స్.. విజయ్‌కు మాటిచ్చారు.
శత్రువులే మిత్రులయ్యారు..
తమిళ సీనియర్ హీరో, డీఎమ్‌డీకే ప్రెసిడెంట్ విజయ్‌కాంత్ మరణ వార్త కోలీవుడ్‌లో కలకలం రేపింది. ఆయన అంత్యక్రియలలో పాల్గొనడానికి ఎంతోమంది తమిళ స్టార్లు తరలివచ్చారు. అందులో విజయ్ కూడా ఒకరు. విజయ్‌కాంత్‌ను ఆఖరి చూపు చూడడానికి వచ్చిన విజయ్‌పై ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా ఎగబడ్డారు. అంతే కాకుండా విజయ్ వెళ్లిపోతున్న సమయంలో కారు ఎక్కబోతుండగా.. ఎవరో తనపై చెప్పును విసిరేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో వల్ల అజిత్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ ఒకటయ్యారు. ఎప్పుడూ బద్ద శత్రువుల్లాగా గొడవపడే ఫ్యాన్స్‌ను విజయ్‌కు జరిగిన అవమానం ఒక్కటి చేసింది.
ట్వీట్ చేసిన అజిత్ ఫ్యాన్స్..
ముందుగా ఈ వీడియోను అజిత్ ఫ్యాన్ క్లబ్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘‘అజిత్ ఫ్యాన్స్‌గా మేము విజయ్ పట్ల జరిగిన అవమానకర ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు ఎవరైనా సరే.. మన ప్రాంతానికి వచ్చినప్పుడు గౌరవించాలి. విజయ్‌పై చెప్పును విసరడం అసలు కరెక్ట్ కాదు’’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఎవరి మొహం స్పష్టంగా కనిపించకపోయినా.. విజయ్‌పై చెప్పు విసరడం మాత్రం కనిపిస్తోంది. మరి ఈ వీడియోను బట్టి ఆ పని చేసింది ఎవరు అని ఎలా కనిపెడతారో అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది విజయ్‌కు అలా జరగడం కరెక్ట్ కాదు, ఆయన కోలీవుడ్‌కే గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అని ఫ్యాన్స్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. అజిత్ ఫ్యాన్స్‌కు తోడుగా విజయ్ ఫ్యాన్స్ కూడా ఉంటామని మాటిస్తున్నారు.
స్పందించని విజయ్..
చెన్నైలోని ఐల్యాండ్ గ్రౌండ్‌లో విజయ్‌కాంత్ అంతిమ సంస్కారాలు జరిగాయి. దానికోసం ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆయనకు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యాయని, అందుకే ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారని వార్తలు వైరల్ అయ్యాయి. అయినా కూడా ఆయన అంత్యక్రియలను నిర్వహించడానికి డాక్టర్లు ఒప్పుకున్నారు. విజయ్‌కాంత్ అంత్యక్రియల కోసం చాలామంది జనం అక్కడికి చేరుకోవడంతో విజయ్‌పై జరిగిన ఘటన విషయంలో ఎవరిది తప్పు అని ఇప్పుడే తేల్చే పరిస్థితి కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. కానీ విజయ్ మాత్రం ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు.
Also Read: ఎన్‌టీఆర్ జాతకంలో దోషం, 2030 వరకు ఆ పని చేయకూడదు - వేణు స్వామి