Singer Keneesha Indirect Reaction About Breakup With Ravi Mohan : కోలీవుడ్ హీరో రవి మోహన్ (జయం రవి)తో సింగర్ కెనీషా రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తన భార్య ఆర్తి రవితో విడాకుల కేసు కోర్టులో ఉండగానే... ఇద్దరూ పలు ఈవెంట్లకు హాజరైన ఫోటోస్ వైరల్ అయ్యాయి. జయం రవి తన సొంత నిర్మాణ సంస్థ 'రవి మోహన్ స్టూడియోస్' లోగో ఆవిష్కరణ టైంలో ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి.

Continues below advertisement

బ్రేకప్ అయిపోయిందా?

తాజాగా ఈ వార్తలు, రూమర్స్‌పై సింగర్ కెనీషా స్పందించారు. ఇండైరెక్ట్‌గా తమకు బ్రేకప్ అయ్యిందనే హింట్ ఇచ్చారు. ఇన్ స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టగా వైరల్ అవుతోంది. ఈ రూమర్స్‌తో తీవ్ర మనో వేదనకు గురైనట్లు చెప్పిన ఆమె... చెన్నై వదిలి వెళ్లిపోతున్నానని తనకు ఇష్టమైన మ్యూజిక్ కూడా వదిలేస్తున్నట్లు చెప్పారు. ఇన్  స్టా అకౌంట్ డిలీట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. 

Continues below advertisement

ప్రేమతో అడుగు పెట్టా...

ఈ కథలో తానెంతో ప్రేమతో అడుగు పెట్టినట్లు చెప్పారు కెనీషా. 'ఇప్పటికే నేను ఎన్నోసార్లు చెప్పాల్సిన దాని కంటే ఎక్కువే చెప్పాను. కథలోకి ఎంతో ప్రేమతో అడుగుపెట్టాను. కానీ ఇప్పుడు నిశ్శబ్దంతో వెనుదిరుగుతున్నా. కొన్నిసార్లు ప్రపంచం మొత్తం అహంకారాలు, అవాస్తవ కథనాలతో నిండిపోతుంది. మంచితనానికి కూడా అక్కడ చోటుండదు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ కూడా భారంగా మారుతుంది. ఓ మనిషిని రక్షించే ప్రయత్నంలో నేను చాలా కోల్పోయా. ఇప్పుడు నాకు ఓ విషయం క్లారిటీగా అర్థమైంది. ప్రదర్శనలకే ప్రాధాన్యమిచ్చే ఈ లోకంలో మంచితనానికి విలువ లేదు.' అంటూ రాసుకొచ్చారు.

Also Read : నువ్వు హీరోయినా... సె*** వర్కరా? - హీరోయిన్‌కు మెసేజ్... ట్విస్ట్ ఏంటంటే?

'మాయగాళ్లతో నిండిపోయింది'

ఈ ప్రపంచం కేవలం అబద్ధాల కోరులు, మాయగాళ్లతో నిండిపోయిందని చెప్పారు కెనీషా. తనపై వచ్చిన ట్రోలింగ్స్‌పై ఆమె రియాక్ట్ అయ్యారు. 'సినిమా ఇండస్ట్రీకి, అతన్ని ప్రేమించే  వారికి సమర్థించే వారితో పాటు అతని జీవితంపై వారికి మాత్రమే హక్కులు ఉన్నాయనుకునే వారికి నేను చెప్పేది ఒక్కటే. అతను ఇక పూర్తిగా మీ వాడే. దీనిపై ఇక ఎలాంటి వివరణలు ఇవ్వను. యుద్ధాలు చేయలేను. పోరాడనూ లేను.

మంచి వ్యక్తులకు జీవించడానికి ఓ ఛాన్స్ ఇవ్వాలని అనుకోవడం, వారికి అండగా ఉండాలని ముందుకు రావడం నా అమాయకత్వం. కానీ ఈ ప్రపంచం కేవలం అబద్ధాల కోరులు, మాయగాళ్లతో నిండిపోయింది. నేను అతన్ని పూర్తిగా వదులుకుంటున్నా. ఇప్పటివరకూ తీసుకున్న బాధ్యతలు అన్నింటి నుంచి వైదొలుగుతున్నా. త్యాగాలు చేసిన జీవితంలోని నిజాల కంటే... భావోద్వేగాలతో అల్లిన కథలనే జనం ఎక్కువగా నమ్ముతారు. మొత్తానికి మీరు ఏదైతే కోరుకున్నారో అదే జరిగింది.' అంటూ రాసుకొచ్చారు.

చెన్నై వదిలేస్తున్నా...

తాను ఓడిపోయానని... ఎంతో ఇష్టమైన మ్యూజిక్, తన జీవితానికి సంబంధించిన ప్రతీదాన్ని వదిలేస్తున్నట్లు చెప్పారు కెనీషా. 'దేవుడు సృష్టించిన దాన్ని మనుషులు ముక్కలు చేయగలరని అర్థమైంది. ఆన్ లైన్ వేధింపులు, ట్రోలింగ్స్ వల్లే అన్నింటికీ దూరమవుతున్నా. ఇన్ స్టా డిలీట్ చేస్తున్నా. సంతోషం ఓడిపోయింది. ఫెమినిజం గెలిచింది.' అని పేర్కొన్నారు. 

Also Read : స్టన్నింగ్ లుక్‌లో రకుల్ - మూవీ ప్రమోషన్ విత్ వీకెండ్ గ్లామరస్ ట్రీట్