Singer Chinmayi Reaction On Sivaji Comments : హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ హీరో శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందం చీరలో నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుందని... సామాన్లు కనపడే దాంట్లో ఏమీ ఉండదని కామెంట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా ఆయన కామెంట్స్‌పై ఫేమస్ సింగర్ చిన్మయి రియాక్ట్ అయ్యారు.
చిన్మయి ఏమన్నారంటే?
తెలుగు నటుడు శివాజీ 'దరిద్రపు ము****' వంటి నిందలతో హీరోయిన్లకు అనవసరమైన సలహాలు ఇస్తారని చిన్మయి అన్నారు. 'వారు తమ సామాన్‌ను కప్పి పుచ్చుకోవడానికి చీరలు ధరించాలి. ఈ పదాన్ని వాడడం చాలా ముఖ్యం. ఎక్కువగా పోకిరీలు ఈ వర్డ్ వాడతారు. శివాజీ ఓ అద్భుతమైన చిత్రంలో విలన్ రోల్ చేశాడు. చివరకు అలాంటి పోకిరీలకు హీరోగా మారాడు. విషయం ఏమిటంటే ఇవి శివాజీ అలాంటి పదాలు వాడిన ప్రొఫెషనల్ ప్రదేశాలు. పబ్లిక్‌గా ఇలాంటి పదాలు వాడడం.
అతను జీన్స్, హుడీస్ వేసుకుంటాడు. కానీ అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ధోతీలు మాత్రమే ధరించాలి. భారతీయ సంస్కృతిని అనుసరించాలి. బొట్టు పెట్టుకోవాలి. అతను వివాహం చేసుకున్నట్లయితే అది తెలియడానికి కంకణం, మెట్టెలు ధరించాలి. ఇక్కడ మహిళలను ఎలా చూస్తారో నమ్మశక్యం కాదు.' అంటూ రాసుకొచ్చారు.
Also Read : రాజాలా పెంచితే రోజా ముందు కూర్చున్నావ్ - నవ్వులు పూయిస్తోన్న 'నారీ నారీ నడుమ మురారి' టీజర్
దీంతో పాటే అంతకు ముందు మరో ట్వీట్ కూడా చేశారు. 'స్త్రీలను ద్వేషించే సమాజంలో పురుషులు వారిపై కామెంట్ చేయడం. అలాంటి పరిస్థితుల్లో స్త్రీలు ఏం ధరించాలి? చాలా మంది మానవత్వం లేకుండా కామెంట్స్ చేస్తున్నారు. ఇది జీవితకాలం నేను మర్చిపోలేను. ఇక్కడ ఆడదిగా పుట్టడం ఓ కర్మ. భరించాలి తప్పదు. ఇక్కడ ఆడవాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పి కూడా ప్రయోజనం లేదు. ప్రారబ్ద కర్మ. భరించి తీరాలి అంతే.' అంటూ రాసుకొచ్చారు.
అసలేం జరిగిందంటే?
హీరోయిన్ల డ్రెస్ సెన్స్‌పై 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివాజీ చేసిన కామెంట్స్‌పై విమర్శలు వచ్చాయి. హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందని అందం చీరలో నిండుగా కప్పుకొనే బట్టల్లో ఉంటుంది తప్ప సామాన్లు కనపడే దాంట్లో ఏమీ ఉండదని అన్నారు. గ్లామర్ ఓ దశ వరకే ఉండాలన్నారు. ప్రపంచ వేదికల మీదైనా చీర కట్టుకున్న వారికే విశ్వ సుందరి కిరీటాలు వచ్చాయని చెప్పారు.