Siva Karthikeyan's Parasakthi New Release Date Locked : సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి. ఈసారి టాలీవుడ్ స్టార్ హీరోల మూవీస్‌తో పాటు కోలీవుడ్ స్టార్స్ డబ్బింగ్ మూవీస్ కూడా పండుగకు వరుసగా రానున్నాయి. ఈ క్రమంలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ 'పరాశక్తి' మూవీ రిలీజ్ డేట్ మారింది.

Continues below advertisement

అనుకున్న దాని కంటే ముందుగానే...

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి 14న మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, తీవ్ర పోటీ కారణంగా జనవరి 10నే తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మూవీలో శివకార్తికేయన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటించారు. సుధా కొంగర దర్శకత్వం వహించగా... రవి మోహన్, అథర్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  ఆకాశ్ భాస్కరన్‌కు చెందిన డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూ.150 కోట్ల బడ్జెట్‌తో 'పరాశక్తి'ని నిర్మిస్తోంది. 

Continues below advertisement

Also Read : 'అందం సామాన్లు కనిపించే దానిలో ఉండదు' - హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ సెన్సేషనల్ కామెంట్స్

బాక్సాఫీస్ హౌస్ ఫుల్

ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ హౌస్ ఫుల్‌గా మారనుంది. రెండు తమిళ మూవీస్‌తో ఒక రోజు తేడాతో రిలీజ్ కానుండడంతో తీవ్ర పోటీ నెలకొంది. దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' మూవీ జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ మూవీ హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. విజయ్ ఇదే తన చివరి మూవీ అని ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక రోజు తర్వాత 'పరాశక్తి' వస్తున్నట్లు ప్రకటించడంతో బాక్సాఫీస్ లెక్కలు మారాయి. 

తెలుగులోనూ వరుస సినిమాలు ఉండడంతో ఈ మూవీకి ఇక్కడ థియేటర్స్ దొరకడం కష్టమే అనే చెప్పాలి. ఒకవేళ దొరికినా వారు అనుకున్నన్ని దొరకవని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. ఇక తెలుగులో ప్రభాస్ 'ది రాజా సాబ్' జనవరి 9న, మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' జనవరి 12న, రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ' జనవరి 14న, నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' జనవరి 14న థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.