Vijay Deverakonda's Rowdy Janardhana Title Glimpse Out : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా 'రాజావారు రాణివారు' ఫేం రవికిరణ్ కోలా కాంబోలో రాబోతోన్న పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'రౌడీ జనార్దన'. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఈ మూవీ నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది.
టైటిల్ గ్లింప్స్ అదుర్స్
'రౌడీ జనార్దన' నుంచి తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటివరకూ చూడని ఓ డిఫరెంట్ పవర్ ఫుల్ యాంగ్రీ లుక్‌లో విజయ్ దేవరకొండ అదరగొట్టారు. విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 'బండెడు అన్నం తిని గుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడైనా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనే ఆడే రాసుకున్నోడు. కన్నీళ్లను ఒంటికి నెత్తురులాగా పూసుకున్నోడు. సావు కళ్ల ముందుకొచ్చి నిలబడితే కత్తై లేసి కలబడినోడు. కనబడ్డాడు నా లోపల.' అంటూ విజయ్ దేవరకొండ తన నట విశ్వరూపాన్ని చూపించారు.
'కళింగపట్నంలో ఇంటికొక ల***** కొడుకు నేను రౌడీని అని చెప్పుకొంటూ తిరుగుతాడు. కానీ ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు. జనార్దన 'రౌడీ జనార్దన'' అంటూ హీరో ఎలివేషన్ డైలాగ్ వేరే లెవల్‌లో ఉంది. మూవీలో విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ చేశారు. ఇదివరకు చూడని భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొడతారని మాత్రం గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. పొలిటికల్, యాక్షన్‌తో పాటే లవ్ టచ్ కూడా ఇవ్వనున్నట్లు అర్థమవుతోంది.
విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ రోల్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Also Read : ఒకే ఫ్రేమ్‌లో నాగ చైతన్య, శోభిత, సమంత! - డోంట్ కన్ఫ్యూజ్... అసలు నిజం ఏంటంటే?
గతంలో దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబోలో 'ఫ్యామిలీ స్టార్' మూవీ వచ్చింది. అలాగే, కీర్తి సురేష్, విజయ్ 'మహానటి' మూవీ కోసం కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్‌లో కలిసి నటిస్తుండడంతో హైప్ క్రియేట్ అవుతోంది. గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ ఖాతాలో సరైన హిట్ పడలేదు. రీసెంట్‌గా వచ్చిన 'కింగ్డమ్' సైతం అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. ఈ క్రమంలో సరైన హిట్ కోసం ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.