Tillu Square Trailer: ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది 'డీజే టిల్లు' మూవీ. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరిలో 12న రిలీజైన ఊహించని రెస్పాన్స్‌ అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. బాక్సాఫీసు వద్ద కూడా భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ మూవీ అంత విజయం సాధించడానికి ప్రధాన కారణం ఈ మూవీ హీరో పర్ఫామెన్స్‌ అని చెప్పాలి. 'డీజే టిల్లు'గా సిద్దూ జొన్నలగడ్డ పండించిన కామెడీ నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి. ఇందులో అతడు చూపించిన గ్రేసూ, హైపర్‌ యాక్టివ్‌నెస్‌, డైలాగ్‌ డెలివరి యువతను బాగా ఆకట్టుకుంది.


తెలంగాణ స్లాంగ్‌కి కామెడీ జోడించి అద్భుతంగా నటించాడు సిద్ధూ. ఆ తరహా పాత్రలు అంటే సిద్దూనే గుర్తొచ్చేంతగా నటించి ఆడియన్స్‌ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా రాధిక అంటూ అతడు చెప్పే ప్రతి డైలాగ్‌కు ఆడియన్స్‌ నుంచి విపరీమైన రెస్పాన్స్‌ వచ్చింది. రాధికా అంటూ డీజే టిల్లును ఫాలోఅవుతుంది యువత. అందుకే ఇప్పుడు 'డీజే టిల్లు స్క్వేర్‌'కు భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. దీంతో ఈ మూవీ నుంచి వస్తున్న ఏ అప్‌డేట్‌ అయినా ఆడియన్స్‌ని అట్రాక్ట్‌ చేస్తుంది. ఇప్పటికే రిలీజైన పాటలకు విశేషమైన స్పందన వచ్చింది. ఇక రీసెంట్‌ విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌ కూడా బాగా వైరల్‌ అయ్యింది.


శ్రీరాములు థియేటర్లో 'టిల్లు' గాడి రచ్చ


ఇక రేపు ప్రేమికుల రోజు సందర్భంగా డీజే టిల్లు స్క్వేర్ నుంచి మేకర్స్‌ అదిరిపోయే అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్‌ డే సందర్భంగా ట్రైలర్‌ లాంచ్‌కు ముహుర్తం ఫిక్స్‌ చేశారు. తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ టైం అండ్‌ ప్లేస్‌ను అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. మ్యాడ్‌నెస్‌ బిగైన్‌ అంటూ ట్రైలర్‌ అప్‌డేట్‌పై హైప్‌ ఇచ్చారు. రేపు శ్రీరాములు థియేటర్లో సాయంత్రం 5:04 గంటలను ట్రైలర్‌ రిలీజ్‌ చేయబోతున్నట్టు తాజాగా అధికారిక ప్రకటించారు మేకర్స్‌. దీంతో మూవీ లవర్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. కాగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 






డీజే టిల్లుకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ మల్లిక్ రామ్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో సిద్దూ మరిన్ని చిత్రాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్‌ అయినట్టు ఇప్పటికే ఆషీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది. ఈ సినిమాకు ‘జాక్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘కొంచెం క్రాక్‌’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని సిద్ధు పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డబుల్‌ గన్‌.. డబుల్‌ ఫన్‌ అనేలా ఈ చిత్రం ఉండబోతుందని, యువతరంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చేలా 'బొమ్మరిల్లు' భాస్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని నిర్మాత చెప్పారు.