టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ రైటర్ కం హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన 'డీజే టిల్లు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2022లో ఓ చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఆ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకోవడమే కాదు హీరో సిద్దు జొన్నలగడ్డ కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా సీక్వెల్ని తెరకెక్కిస్తున్నారు. ఈసారి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ తో డబుల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయింది. గత కొద్ది నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు.


అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ ని రివిల్ చేశారు. ఏకంగా సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ తాజాగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ని రిలీజ్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. నిజానికి మార్చి నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో వాయిదా పడింది. ఇక రీసెంట్ గా ఆగస్టులో ఈ మూవీ చిరంజీవి, రజనీకాంత్ సినిమాలకు పోటీగా రాబోతుందంటూ వార్తలు వినిపించాయి. కానీ మేకర్స్ మాత్రం ఎటువంటి రిస్క్ తీసుకోకుండా సెప్టెంబర్ 15న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్లో కార్ లో అనుపమ సిద్దు తో రొమాన్స్ చేస్తూ కనిపించిన స్టిల్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఇక తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో డీజే టిల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.


ఇక డిజె టిల్లు మూవీని విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తే.. ఈ సీక్వెల్ ని మాత్రం మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి కథ మాత్రం సిద్దునే అందిస్తున్నాడు. నిజానికి ఈ సీక్వెల్ ని కూడా విమల్ కృష్ణ డైరెక్ట్ చేయాలి. కానీ సిద్దు కి డైరెక్టర్ కి మధ్య కొన్ని ఇష్యూస్ జరగడం మూలాన ఈ సీక్వెల్ నుంచి దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. దీంతో విమల్ కృష్ణ ప్లేస్ లో మల్లిక్ రాం సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బానర్ పై సూర్యదేవర నాగవంశం నిర్మిస్తున్న ఈ సినిమాకి రామ్ మిర్యాల మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇక డీజే టిల్లు బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సీక్వెల్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. మరి మరోసారి ఆ అంచనాలను ఈ టిల్లు స్క్వేర్  అందుకుంటుందా? లేదా చూడాలి.