తెరపై మెరిసే స్టార్స్ గురించి, ముఖ్యంగా వాళ్ళ పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మూవీ లవర్స్ కి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సందర్భం దొరికితే చాలు వాళ్లను తమకు తోచిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటారు. అయితే నిజానికి సెలబ్రిటీలు అందరూ తమ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా కొంతమంది ప్రముఖులు తమ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ను సపరేట్ గా చూస్తారు. కానీ అభిమానులు మాత్రం ఈ రెండు విషయాలను కలగలపి చూస్తారు. అది కొన్నిసార్లు సెలబ్రిటీలకు చికాకు తెప్పించే విషయం అవుతుంది. ఇలా ఎన్ని సార్లు జరిగినా సరే నెటిజన్లు మాత్రం తరచూ విసుగు తెప్పించే ప్రశ్నలు అడిగి, వాళ్ళ ఆగ్రహానికి కారణం అవుతారు. తాజాగా శృతి హాసన్ (Shruti Haasan)కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది.


ప్రస్తుతం శృతి హాసన్ 'కూలీ' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇంస్టాగ్రామ్ లో ఇంటరాక్టివ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పాల్గొంది శృతి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు అభిమానులతో ఇలా టచ్ లో ఉంటూ చలాకిగా కన్పిస్తుంది. ఇక తాజాగా జరిగిన ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు శృతి హాసన్ సమాధానం ఇచ్చింది. అందులో భాగంగా ఓ నెటిజన్ "నేను ఇంతకు ముందు కూడా ఇదే ప్రశ్న అడిగాను. కానీ మీరు స్పందించలేదు. కానీ మీరు రిప్లై ఇవ్వలేదు. ఇంతకీ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ?" అని ప్రశ్నించారు. దీంతో అతని ప్రశ్నకి శృతి హాసన్ స్పందిస్తూ "లేదు... అడగడం మానేయండి" అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో పెళ్లి ప్రశ్న గురించి శృతిహాసన్ ఇచ్చిన సమాధానం మరోసారి వైరల్ గా మారింది.


Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?


నిజానికి శృతి హాసన్ కి ఇలాంటి ప్రశ్నలు ఎదురవడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురు కాగా, శృతి హాసన్ స్పందిస్తూ "నేను పూర్తిగా నిజాయితీగా ఉంటానని అనుకోవట్లేదు. కాబట్టి దీని నుంచి మనం ముందుకు సాగవలసిన సమయం వచ్చేసిందని నేను అనుకుంటున్నాను" అంటూ సూటిగా సమాధానం చెప్పింది. శృతికి ఇటీవల కాలంలో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా శాంతను హజారికాతో ఆమె రిలేషన్షిప్ బ్రేక్ అయ్యాక. 


కోవిడ్ 19 లాక్ డౌన్ టైంలో శృతి హాసన్ డిజైనర్ శాంతను హాజరికాతో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట కొంతకాలం ముంబైలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. కానీ ఆ తర్వాత సడన్ గా ఇద్దరు తమ రిలేషన్షిప్ కి బ్రేక్ వేశారు. అప్పటి నుంచి శృతిహాసన్ సింగిల్ గానే ఉన్నానని చెప్పుకొస్తోంది. ఇదిలా ఉండగా శృతిహాసన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలి' సినిమాలో నటిస్తోంది. అలాగే ఆమె ఖాతాలో ప్రస్తుతం ప్రభాస్, పృధ్విరాజ్ సుకుమారన్ కలిసి నటించిన 'సలార్' సీక్వెల్ 'శౌర్యంగ పర్వం' కూడా ఉంది.


Also Read: ఆస్తుల్లో తన వాటా తీసుకుని ముంబైలో ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి - అన్నదమ్ముల గొడవను అక్క తీర్చే చాన్స్ లేదా ?