Shruti Haasan Quits From Social Media: హీరోయిన్ శ్రుతి హాసన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. కొద్ది రోజులు సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్ స్టా స్టోరీలో వెల్లడించారు.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోస్‌తో పాటు వ్యక్తిగత విషయాలు, మూవీస్ సంగతులను ఇన్ స్టా వేదికగా  అభిమానులతో పంచుకుంటుంటారు శ్రుతి హాసన్. అయితే... తాజాగా ఆమె కొన్ని రోజులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 'కొద్ది రోజులు నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా.' అంటూ రాసుకొచ్చారు.

అదే కారణమా?

కొద్ది రోజుల క్రితమే శ్రుతి హాసన్ 'X' అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఆమె ఖాతాలో అసాధారణ ట్వీట్స్ కనిపించాయి. క్రిప్టో కరెన్సీ, మీమ్ కాయిన్స్‌కు సంబంధించిన లింక్స్ దర్శనమిచ్చాయి. వీటిని చూసిన ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్ షాక్ కాగా... తన అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందంటూ ఆమె తెలిపారు. దయచేసి ఎవరూ ఆ మెసేజ్‌లకు రెస్పాండ్ కావొద్దని సూచించారు. గతంలోనూ ఆమె ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు.

ఈ కారణంగానే శ్రుతిహాసన్ కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఫాలోవర్స్ మాత్రం శ్రుతి హాసన్ త్వరగా సోషల్ మీడియాకు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఎప్పటిలాగే అన్నీ విషయాలు షేర్ చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Also Read: వామ్మో... రష్మిక మందన్న షాకింగ్ లుక్ - నేషనల్ క్రష్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?... రీజన్ ఏంటంటే?

ఇక సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం శ్రుతి హాసన్ రజినీ కాంత్ 'కూలీ' (Coolie) మూవీలో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా... గోల్ట్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. తలైవాతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషించారు. స్పెషల్ రోల్‌లో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించనున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ మూవీని నిర్మిస్తున్నారు. కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ చేయనున్నట్లు సమాచారం. ఆగస్ట్ 14న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతుండగా... ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ మూవీని తీసుకొస్తున్నారు.

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా కాకుండా తనదైన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్. తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు హాలీవుడ్‌లోనూ మూవీస్ చేశారు. 'అనగనగా ఓ ఫ్రెండ్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె గబ్బర్ సింగ్, ఎవడు, బలుపు, శ్రీమంతుడు, క్రాక్, వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీస్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత 'కూలీ' మూవీతో ఆమె ప్రేక్షకులను ముందుకు వస్తున్నారు.