Shree Ram Jai Hanuman First Look: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అయోధ్య పేరే వినిపిస్తోంది. ఇక ఇలాంటి రోజున ‘శ్రీ రామ్, జై హనుమాన్’ అనే మూవీ పోస్టర్‌ విడుదలయ్యింది. సురేశ్ ఆర్ట్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కడానికి సిద్ధమవుతోంది. ఒరిజినల్‌గా కన్నడ భాషలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. దాంతో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలవుతుంది. రామాయణంపై ఇప్పటికే ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. కానీ అందులో చాలామందికి తెలియని కొత్త విషయాలను చెప్తూ.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ హామీ ఇస్తున్నారు.


రామాయణం గురించి ఎవరికీ తెలియని కథ..


ప్రస్తుతం అంతటా అయోధ్య గురించే చర్చలు నడుస్తుండగా.. ఇలాంటి రోజు పోస్టర్ రిలీజ్ చేస్తే మూవీకి హైప్ క్రియేట్ అవుతుందని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది. ‘రామాయణ ఇతిహాసం గురించి ఎవరికీ తెలియని అంశం’ అని అర్థం వచ్చే ట్యాగ్ లైన్‌తో ‘శ్రీ రామ్, జై హనుమాన్’ మూవీ పోస్టర్ విడుదలయ్యింది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగిన ముహుర్తానికే ఈ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. మూవీ టీమ్ చెప్పిన దాన్నిబట్టి చూస్తే రామాయణం గురించి, రాముడి కథ గురించి ఇంకా ఎక్కడో దాగి ఉన్న విషయాలను రీసెర్చ్ చేశారని అర్థమవుతుంది. ఇప్పటికే ఈ ఇతిహాసంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో ఈ ఇతిహాసానికి సంబంధించిన చాలావరకు విషయాలు కవర్ అయ్యాయి. అలా అన్ని సినిమాల్లో చూపించని విషయం.. ‘శ్రీ రామ్, జై హనుమాన్’లో ఏం చూపిస్తారనే అంశం ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.


నటీనటులపై క్లారిటీ లేదు..


‘శ్రీ రామ్, జై హనుమాన్’ నుండి విడుదలయిన పోస్టర్‌లో రాముడు, హనుమంతుడు కనిపిస్తున్నారు. ఈ మూవీని అవధూత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ ఇతిహాస కథలో యాక్షన్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. సురేశ్ ఆర్ట్స్ బ్యానర్‌పై కేఏ సురేశ్.. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన సురేశ్.. ‘శ్రీ రామ్, జై హనుమాన్’ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న మూవీ కాబట్టి అన్ని భాషల నుండి నటీనటులు.. ఇందులో భాగం కానున్నారని సమాచారం.






త్వరలోనే మరింత సమాచారం..


ప్రస్తుతం ‘శ్రీ రామ్, జై హనుమాన్’ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పనులు పూర్తయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లోకి ఎంటర్ అవ్వనుంది. అప్పుడు మూవీ గురించి మరింత సమాచారం ఇస్తామని మేకర్స్ చెప్తున్నారు. ఇప్పటికే రామాయణంపై ఎన్నో సినిమాలు వచ్చినా.. ఇంకా ఎన్నో సినిమాలు రావడానికి సిద్ధంగా ఉన్నా.. వాటన్నింటికి భిన్నంగా ఈ ఇతిహాసం గురించి ఎవరికీ తెలియని ఒక కోణాన్ని ప్రేక్షకులకు చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూవీ క్యాస్ట్ ఎవరో రివీల్ చేసిన తర్వాత ‘శ్రీ రామ్, జై హనుమాన్’పై ప్రేక్షకుల్లో హైప్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.


Also Read: ప్రభాస్ 'కల్కి'లో మలయాళ బ్యూటీ - నాగ్ అశ్విన్ గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నాడుగా!