Anirudh Ravichander : టాలెంటెడ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్ కున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాలో SRK మేక్ఓవర్‌తో పాటు అనిరుద్ BGMలతో ఈ చిత్రం ప్రివ్యూ ఇప్పటికే అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అన్ని చోట్లా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న అనిరుద్..  జవాన్ చిత్రానికి సంగీతం అందించినందుకు తీసుకున్న పారితోషికం విలువ తెలిసి ఇప్పుడు అందరూ అవాక్కవుతున్నారు. ఆయన రెమ్యునరేషన్ ఈ రేంజ్ లో ఉంటుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


జూనియర్ ఎన్టీఆర్-  కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న 'దేవర' సినిమాకి కూడా అనిరుద్ ప్రస్తుతం మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో పనిచేస్తూ బిజీగా ఉన్న అనిరుద్.. కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా.. అన్ని చోట్లా తన హవానే కనబరుస్తూ.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. దాంతో పాటు షారుక్ ఖాన్ నటిస్తోన్న 'జవాన్' సినిమాకి సైతం ఆయనే మ్యూజిక్ అందిస్తుండడం మరో చెప్పుకోదగిన విషయం. అట్లీ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన నయనతార నటిస్తోంది.


అయితే తాజా అప్ డేట్ ప్రకారం 'జవాన్' సినిమా కోసం అనిరుధ్ 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా, అందరి కంటే ఎక్కువగా ఆస్కార్-విజేత స్వరకర్త AR రెహమాన్ 8 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడు. కానీ ఈ సారి అనిరుధ్ రెమ్యునరేషన్ రెహమాను ను కూడా మించిపోయింది. అంటే ఇప్పటివరకు ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరూ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు. దీంతో అనిరుధ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు అనిరుధ్. అనిరుధ్ ప్రస్తుతం దక్షిణాదికి చెందిన మూడు సినిమాలకు సంగీతం అందిస్తుండగా.. అందులో రజనీకాంత్ 'జైలర్', తలపతి విజయ్ 'లియో', ఎన్టీఆర్ 'దేవర' ఉన్నాయి.


ఇక 'జవాన్' విషయానికొస్తే.. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్' కు గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన నయనతార ఫస్ట్ లుక్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆమె స్ట‌న్నింగ్‌గా, యాక్ష‌న్ ప్యాక్డ్ అవ‌తార్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం జ‌వాన్ హీరోయిన్ న‌య‌న‌తార లుక్‌కి అంద‌రూ ఫిదా అవుతున్నారు. ప్రివ్యూలో ఆమె లుక్ చూసిన వాళ్లు సినిమాలో మ‌రో రేంజ్‌లో ఉండి తీరుతుంద‌ని భావిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ వారి అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా డిజైన్ అయిందని అంటున్నారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలోకి రానుంది. 


Read Also : కంటెంటే కింగ్, ప్రేక్షకుల నాడి పట్టుకున్నవారికే సక్సెస్ - 2023 సెకండాఫ్‌లో హిట్టు కొట్టేదెవరు?










ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial