Ajith Kumar Wife Shalini Shared Throwback Photo with Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మూవీ ఎవర్‌గ్రీన్‌ అని చెప్పాలి. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకక్కిన ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సోసియో ఫాంటసీ జానర్‌లో 1990లో ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఇందులో అతిలోక సుందరిగా నటించని శ్రీదేవిని ఇప్పిటికీ ఆమె ఫ్యాన్స్‌ అలాగే చూస్తారు. ఈ చిత్రంలో ఆమె అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.


ఇక చిరంజీవి కెరీర్‌లో ఈ మూవీ మరో మైల్‌స్టోన్‌గా నిలిచింది. అంతటి విజయం సాధించిన ఈ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్టులుగా నటించిన చిన్నారులు కూడా తమ నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. వారెవరో కాదు తమిళ స్టార్‌ హీరో అజిత్‌ భార్య, మాజీ నటి షాలిని ఆమె సోదరి నటి షామిలి, ఆమె సోదరుడు, నటుడు రిచర్డ్ రిషి. ఈ  ముగ్గురు ఈ ఇందులో చైల్డ్‌ ఆర్టిస్టులుగా నటించి తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి కోసం 'జై చిరంజీవా' పాటలో తమ అద్భుతమైన నటన, ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరిని ఆకట్టుకున్నారు.


అయితే ఇప్పుడు ఈ మూవీ 34 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా నటి షాలిని త్రోబ్యాక్‌ ఫోటో షేర్‌ చేశారు. చిరంజీవితో కలిసి అప్పుడు, ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటోను షాలిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. "లవ్లీ త్రోబ్యాక్‌ విత్‌ చిరంజీవి సార్‌" అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. అలాగే ఆమె సోదరుడు, నటుడు రిచర్డ్‌ రిషి కూడా అదే ఫోటోను అప్పుడు, ఇప్పుడు అంటూ పంచుకున్నారు. ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇండస్ట్రీలో చిరంజీవికి ప్రత్యేకమైన గుర్తింపు. అందరితో సన్నిహితంగా ఉంటూ ఇండస్ట్రీలో అజాతశత్రువుగా పేరు గడించారు. ఇక రీసెంట్‌గా చిరంజీవి లేటెస్ట్‌ మూవీ షూటింగ్‌ షాలిని భర్త, స్టార్‌ హీరో అజిత్‌ సందడి చేసిన సంగతి తెలిసిందే.






మూవీ సెట్‌లో చిరంజీవిని కలిసి ఆయన సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ ఫోటోలను చిరంజీవి షేర్‌ చేస్తూ..అజిత్‌ సడెన్‌ తన మూవీ సెట్‌లో అడుగుపెట్టడం తనకు సర్‌ప్రైజ్‌ని ఇచ్చింది. ఆయనను కలవడం తనకో అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందంటూ మెగాస్టార్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన 'విశ్వంభర' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేం వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి కెరీర్‌లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మాదిరిగానే ‘విశ్వంభర’ సోసియో ఫాంటసీ మూవీగా రూపొందుతుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా, సురభిల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  


Also Read: మరో మూడు రోజుల్లో 'కల్కి' ట్రైలర్‌ - మరో కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేసిన టీం, వారియర్‌గా కనిపించిన బిగ్‌బి