ష‌క‌ల‌క శంక‌ర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శ్రీ‌కాకుళం యాస‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ క‌మెడియ‌న్. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడిగా కూడా ఈయ‌న‌కు స‌ప‌రేట్ ఇమేజ్ ఉంది. జ‌బ‌ర్దస్త్ నుంచి ప్ర‌యాణం మొద‌లుపెట్టి.. ఇప్పుడు వెండితెర‌పై వెలిగిపోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు షకలకశంకర్


Also Read: జిమ్‌లో మెగాస్టార్‌‌తో ప్రకాష్ రాజ్ ‘చిరు’ మంతనాలు.. ‘మా’లో కాకరేపుతున్న ట్వీట్


కమెడియన్ గానే కాకుండా హీరో గా కూడా తనిని తాను ప్రూవ్ చేసుకుంటున్న నవ్వుల వీరుడు షకలక శంకర్ ‘శంభో శంకర’ సినిమాతో హీరోగా ఫేస్ టర్నింగ్ ఇచ్చాడు.  శంభో శంకర ...శంకర్ కి హీరోగా తొలిచిత్రం అయినప్పటికీ మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు చిత్ర యూనిట్. తొలి రోజే  మొత్తం రెండు కోట్ల కలెక్షన్లు వసూలు చేసిందని సంబర పడ్డారు. ఆ తర్వాత వచ్చిన... నేనే కేడీ నంబర్ 1,  డ్రైవర్ రాముడు, ‘బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది’ సినిమాలు కూడా ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తోన్న మూవీ కార్పోరేటర్. ఈ  మూవీ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.


షకలక శంకర్  కార్పోరేటర్ ట్రైలర్



Also Read: ఇష్క్‌బాయ్‌ని బెదిరిస్తోన్న మిల్కీ బ్యూటీ.. చూపులతో కాదు తుపాకీతో..


Also Read: గెడ్డం, మీసాలతో అనుపమా హల్‌చల్.. సెక్సీ దుస్తుల్లో పూజా హెగ్డే, రాశీఖన్నా రచ్చ!


కర్పోరేటర్ సినిమా ద్వారా సంజయ్ పూనూరి దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాని సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతగా, డాక్టర్ ఎస్.వి.మాధురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా మొత్తం కామెడీ ప్రధానంగా జరుగుతున్నప్పటికీ అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాలో షకలక శంకర్ సరసన సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎం.ఎల్.పి.రాజా సంగీతం అందిస్తున్నారు.


Also read: స్టార్ హీరోలా..అయినా తగ్గేదేలే అంటున్న లీకువీరులు..సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ పెద్దలు


Also Read: రాజ రాజ చోర, తరగతి గది దాటి, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరీస్ 9 సహా ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో తెలుసా....


అయితే కమెడియన్ లు హీరోలుగా మారడం ఎప్పటి నుంచో ఉంది. కొందరు హీరోగా మారిన తర్వాత సక్సెస్ అయి కొనసాగించగా...మరికొందరు అటు కమెడియన్ వేషాలు వదులుకుని...హీరో అవకాశాలు కోసం మాత్రమే ఎదురూచూసి కెరియర్ వెనకబడేలా చేసుకున్నారు. అయితే షకలక శంకర్ మాత్రం ఓ వైపు హీరోగా ప్రయత్నిస్తూనే మరోవైపు కమెడియన్ గానూ కొనసాగుతున్నాడు. వచ్చిన ఏ అవకాశాన్నీ మిస్ చేసుకోకుండా ముందుకు సాగుతున్నాడు.