వెండితెరపై అలరించిన అలనాటి నటీమణులు చాలామంది కనుమరుగయ్యారు. 80, 90లలో తమ అందం, అభినయంతో ఆకట్టుకున్న ఎందరో స్టార్ హీరోయిన్స్.. పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమై పోయారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కథానాయికలు కొందరు.. నటనను వదిలేసి పర్సనల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా కారణంగా అలాంటి నటీమణుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలి ఒక సీనియర్ నటి పోస్ట్ వల్ల, ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయిన మరో హీరోయిన్ వార్తల్లో నిలిచింది.

 

సీనియర్ నటి రాధా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 1980 దశకంలో అగ్ర తారగా రాణించిన రాధ.. తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో నటించింది. ఒక దశాబ్ద కాలం పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. 90వ దశకం ప్రారంభంలోనే సినిమాలకి దూరమైన ఆమె.. అప్పుడప్పుడు కొన్ని టెలివిజన్ షోలలో గెస్టుగా కనిపించింది. తన ఇద్దరు కుమార్తెలను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన రాధ.. సోషల్ మీడియా ద్వారా అందరికీ టచ్ లో ఉంటోంది.

 

రీసెంట్ గా రాధ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఒక త్రో బ్యాక్ పిక్ తో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. "టిక్ టిక్ టిక్ సినిమా షూటింగ్ రోజులలో నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో ఇది ఒకటి. అప్పటికి అది జాబ్ లో భాగమని అనిపించి ఉండవచ్చు. కానీ.. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అలా కనిపించడానికి మేము ఫేస్ చేసిన స్ట్రగుల్, స్త్రెంత్ ని నేను మెచ్చుకుంటున్నాను. సరైన భంగిమతో కనిపించే నటి మాధవికి ప్రత్యేక ప్రశంసలు లభిస్తాయి. బాడీతో పాటు యాటిట్యూడ్ తో పని చేయగలిగినందుకు ఆమెకు హ్యాట్సాఫ్. చాలా చెప్పలేని ఆలోచనలు ఉన్నాయి. ఈ రోజు నేను ఇక్కడ ఈ ఫోటోని షేర్ చేయడం ద్వారా కొన్ని మెమోరీస్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాను" అని రాధ నాయర్ పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో పాటుగా రాధ, మాధవి ఉన్నారు. ఇందులో మాధవి టూ పీస్ బికినీ ధరించి వుంది. 1981లో వచ్చిన 'టిక్ టిక్ టిక్' సినిమాలోనిదీ స్టిల్. రాధకు ఇది సెకండ్ మూవీ కాగా, మాధవి అప్పటికే అనేక చిత్రాల్లో నటించింది. 80స్ లో బికినీ వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ మాధవి ఏకంగా టూ పీస్ బికినీ ధరించి హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ కాస్ట్యూమ్స్ ను డిజైనర్ వాణీ గణపతి రూపొందించినట్లు రాధ పేర్కొన్నారు.

 

రాధ పోస్ట్ తో సీనియర్ హీరోయిన్ మాధవీ కూడా ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్రస్తుతం  ఎక్కడ ఉంది? ఏమి చేస్తోంది? అని నెటిజన్లు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. మాధవి ఇన్స్టాగ్రామ్ ఐడీని కూడా రాధ షేర్ చేయడంతో.. అందరూ తన ఫ్యామిలీ సంగతులను తెలుసుకుంటున్నారు.

 

మాధవి 1996లో రాల్ఫ్ శర్మని వివాహం చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. మ్యారేజ్ తర్వాత అమెరికాలో స్థిరపడిపోయారు. ఆమెకి ముగ్గురు కూతుళ్లు ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్ ఖాతాలోని ఫోటోలను బట్టి తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మాధవి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. సినీ అభిమానులు ఆమెను చూసి షాక్ అవుతున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు.

 



ఇదిలా ఉంటే, మాధవి - మెగాస్టార్ చిరంజీవిలది హిట్ పెయిర్ అని చెప్పాలి. ఎన్నో సినిమాలలో కలసి నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ , ‘కోతల రాయుడు’, ‘ప్రాణం ఖరీదు’, ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’, ‘ఖైదీ’, ‘బిగ్ బాస్’ వంటి సినిమాల్లో చిరుతో కలిసి నటించింది. ఒక దశలో చిరంజీవి హీరోగా నటించే ప్రతి సినిమాకూ మాధవిని హీరోయిన్ గా తీసుకోవాలని రికమెండ్ చేసేవారనే టాక్ వుంది. అయితే ఎన్ని సినిమాలు చేసినా ‘మాతృదేవోభవ’ సినిమా మాత్రం ప్రేక్షకుల మనసుల్లో చెరుగని ముద్ర వేసింది. మెయిన్ లీడ్ గా తెలుగులో అదే ఆమెకు చివరి చిత్రం. ఆ తర్వాత 1996లో 'బిగ్ బాస్' చిత్రంలో కనిపించిన మాధవి.. సినిమాలకు దూరమైంది.