Senior Actress Aamani: అలనాటి తెలుగు సీనియర్ హీరోయిన్స్ లో ఆమని కూడా ఒకరు. తమిళ సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేసిన ఆమనిని ఈవీవీ సత్యనారాయణ తెలుగులో పరిచయం చేశారు. 'జంబలకడిపంబ' సినిమాతో ఆమని టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మిస్టర్ పెళ్ళాం', 'శుభలగ్నం', 'శుభసంకల్పం' లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఆమని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమని తన సినీ కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ క్రమంలోనే షూటింగ్ వల్ల తన తండ్రిని చివరి చూపు కూడా చూసుకునే అవకాశం రాలేదని తెలిపింది.


నేను షూటింగ్ లో ఉన్నప్పుడు నాన్న గారు చనిపోయారు..


"మా నాన్నగారు హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు. నేనప్పుడు తమిళ్ మూవీ షూటింగ్లో వేరే ఎక్కడో అవుట్ డోర్ లో ఉన్నా. మా అమ్మ కూడా నాతో పాటే ఉంది. మా బ్రదర్ కు తెలిసి వెంటనే వెళ్ళిపోయాడు. నాకు కూడా కబురు చేశారు. అప్పట్లో సెల్ ఫోన్స్ ఉండేవి కాదు కదా. హోటల్ లో ఉన్న ఫోన్ కి ఇన్ఫార్మ్ చేశారు. హోటల్ లో ఉన్న రిసెప్షన్ వాళ్ళు ఈ విషయం ప్రొడ్యూసర్ కి చెప్పారు. అప్పుడు నేను అవుట్ డోర్ షూట్ లో ఉన్న" అని తెలిపింది. 


నాన్న పోయారనే విషయం నాకు చెప్పనేలేదు


"నిర్మాతకు ఈ విషయం తెలిసినా నాకు చెప్పలేదు. ఎందుకంటే అప్పుడే క్లైమాక్స్ సీన్ షూట్ జరుగుతుంది. పైగా ఆల్ ఆర్టిస్ట్స్ కాంబినేషన్. ఈ టైంలో చెప్తే ఆ అమ్మాయి ఈ రోజే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మనకు షూటింగ్ కష్టమైపోద్దని ఆయన నాకు చెప్పలేదు. ఏదో మీ నాన్న గారు సీరియస్ అంట అని చెప్పారు. కానీ నాన్న గారు చనిపోయారని మాత్రం చెప్పనేలేదు. సీరియస్ అంటే మా నాన్నకు హెల్త్ ఇష్యుస్ ఉన్నాయి కదా అని అప్పుడు కొంచెం భయపడ్డాను. వెంటనే నాన్న గారికి ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వడం లేదు. ఆ నెక్స్ట్ డే మా బ్రదర్ కి కాల్ చేయమని ప్రెజర్ చేస్తే.. అప్పుడు నాన్న గారు పోయారని చెప్పారు. దాంతో వెంటనే ఈవినింగ్ ఫ్లైట్ కి బయలుదేరి వచ్చాము. నేను వచ్చేసరికి మా బ్రదర్ నాన్న గారి కార్యాలన్ని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేశాడు. ఆ సంఘటనని నేనెప్పుడూ మర్చిపోలేను" అని చెప్పింది.


వాళ్ళని కూడా తప్పుపట్టడానికి లేదు


"మా నాన్నగారు పోయారనే విషయం నాకు చెప్పలేదని వాళ్ళని కూడా ఏమి అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ల సిచువేషన్ ఏంటంటే, నేను కొత్త అమ్మాయి. షూటింగ్ మధ్యలో ఈ అమ్మాయి వెళ్ళిపోతే ఈమె కోసం పెద్దపెద్ద ఆర్టిస్టుల కాంబినేషన్ మిస్ అవుతుందనేది వాళ్ళ ప్రాబ్లమ్.. నా ప్రాబ్లమ్ ఏంటంటే, మా నాన్నగారు పోయారు ఆ విషయం నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితిని నేను లైఫ్‌లో ఫేస్ చేయాల్సి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.


Also Read : చియాన్ విక్రమ్ బర్త్ డే స్పెషల్ - 'తంగలాన్' నుంచి మేకింగ్ వీడియో, విక్రమ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!