తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు నటుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దగ్గుపాటి రాజా. మూవీ మొఘల్ డి. రామానాయుడు అన్న కొడుకు అయిన దగ్గుబాటి రాజా 90 ల కాలంలో హీరోగా చాలా సినిమాలో నటించారు. ఆయన నటించిన చిత్రాలు తెలుగులో కంటే తమిళ్ లోనే బాగా హిట్ అయ్యాయి. అలా తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన దగ్గుబాటి రాజా కొంతకాలం తర్వాత సినిమాలకు దూరమయ్యారు. గతంలో బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్ బయోపిక్' లో కీలక పాత్రలో కనిపించిన ఆయన మళ్లీ చాలాకాలం తర్వాత రీసెంట్ గా వచ్చిన 'స్కంద' మూవీ లో కనిపించి ఆకట్టుకున్నారు.


సినిమాలో రామ్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. ఇదిలా ఉంటే 'స్కంద' మూవీ ప్రమోషన్స్ లో భాగంగాతాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దగ్గుబాటి రాజా బాలయ్య పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు." స్కంద మూవీ లో బోయపాటి గారు నన్ను చాలా డిఫరెంట్ వేలో చూపించారు. సినిమాని ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా నటించారు. ముఖ్యంగా సినిమాలో నాకు మంచి డైలాగ్స్ ఇచ్చారు, మంచి సీన్స్ పడ్డాయి" అని చెప్పారు.


తమిళంలో కానీ తెలుగులో కానీ మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అని అడగగా దానికి దగ్గుబాటి రాజా బదులిస్తూ.." ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్సే. వాళ్లలో అజిత్, విజయ్, ప్రభు, విక్రమ్ నాతో చాలా క్లోజ్ గా ఉంటారు. మేము కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటాం. తెలుగులోకి వచ్చే సరికి, బాలకృష్ణ గారు నాకు చాలా క్లోజ్. ఆయన దగ్గర మాత్రమే నాకు నేనుగా, చాలా ఫ్రీగా ఉంటాను ఆయన కూడా నాతో అంతే క్లోజ్ గా సరదాగా ఉంటారు. ఆయన్ని ఎక్కువసార్లు కలవలేకపోయాను. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారు. కానీ కలిసినప్పుడల్లా మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది" అని చెప్పుకొచ్చారు.


"నాకు పర్సనల్ గా యాక్టర్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అలా అని నేను సినిమాని, ఇండస్ట్రీ ని ద్వేషించే వాడిని కాదు. సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చెన్నైలో ఉన్నప్పుడు వీకెండ్స్ కో ప్రతి థియేటర్లో అన్ని సినిమాలు చూసే వాడిని. నేను యాక్టర్ అయ్యాక కూడా నన్ను యాక్టర్ గా ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చినా నాకు నచ్చదు. అది నాకెందుకో కంఫర్టబుల్ గా అనిపించదు. ఎందుకంటే ఒక మనిషిగా మన పని మనం చేసుకుంటున్నాం అంతే. అయితే నేను యాక్టర్ గా చేసిన రోజుల్లో నాకు అమితాబచ్చన్, ఎన్టీ రామారావు గారిని కలవాలని అనిపించింది. ఎందుకంటే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఎదగడం నాకు ఎంతో బాగా నచ్చింది" అంటూ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


స్టార్ హీరో కావలసిన దగ్గుపాటి రాజా సినీ అవకాశాలు రాకపోవడంతో అప్పట్లో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. చాలా కాలం పాటు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూసిన ఆయన అవకాశాలు రాకపోవడంతో తన తండ్రి గ్రానైట్ వ్యాపారంలో స్థిరపడ్డారు. ఇటీవల 'స్కంద' మూవీ తో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టారు. మరి రాబోయే రోజుల్లో తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలాగే కంటిన్యూ అవుతారేమో చూడాలి.


Also Read : షారుఖ్ Vs ప్రభాస్ - సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!





Join Us on Telegram: https://t.me/abpdesamofficial