Vijaya Chamundeswari Comments on Chiranjeevi: మహానటి సావిత్రి పేరుతో రాసిన 'సావిత్రి క్లాసిక్స్‌' బుక్‌ను నిన్న మంగళవారం హైదరాబాద్‌ గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. సావిత్ర నటించిన పలు క్లాసికల్‌ సినిమాలను 'సావిత్రి క్లాసిక్స్‌' పేరుతో సంజయ్‌ కిషోర్‌ రచించిన ఈ బుక్‌ను మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాండ్‌ ఈవెంట్‌కు పరుచూరి గోపాల కృష్ణ, మొరళి మోహన్‌, బ్రహ్మనందం, జయసుధ వంటి ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. పుస్తక ఆవిష్కరణ అనంతరం విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ చిరంజీవిపై ఆసక్తిక కామెంట్స్‌ చేశారు.


"ఈ బుక్‌ లాంచ్‌కి పిలవడం కోసమనే కాదు.. ఆయన పద్మ విభూషణ్‌ వచ్చాక ఒక్కసారి కూడా కలవలేదు. అలా కలుద్ధామని స్వయంగా ఇంటికి వెళ్లాను. నన్న చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ఈ బుక్‌ లాంచ్‌ను ఏదో ఇంట్లోనే చిన్నగా చేద్దాం అన్నారు. అప్పుడు చిరంజీవి గారు ఆ సరేలా అన్నారు. కానీ ఇంత గ్రాండ్‌గా ఈవెంట్‌ను ప్లాన్‌ చేశారు. నిజం అమ్మకు ఒక పెద్ద కొడుకు ఉంటే ఏం చేసేవారో ఈ రోజు చిరంజీవి గారు అది చేశారు. అమ్మకు ఒక పెద్ద కొడుకు స్థానంలో ఉండి ఆయన ఇదంతా చేశారు" అంటూ ఆమె ఎమోషనల్‌ అయ్యారు. ఇక ఈవెంట్‌లో చిరంజీవి సతీమణి సురేఖ సావిత్రి కూతురు విజయం చాముండేశ్వరిని ఇంటర్య్వూ చేయడం విశేషం. 


'పొద్దున్నే లేవగానే అమ్మ మొహం చూస్తా'


ఈ సందర్భంగా  సావిత్రి క్లాసిక్స్ బుక్‌ చిరంజీవి గారి చేతుల మీదుగే విడుదల చేయడానికి కారణం అడిగారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఒక ఆసక్తికర విషయం చెప్పారు. "ఫస్ట్‌ టైం మీ ఇంటికి(చిరంజీవి ఇంటికి) వచ్చినప్పుడు ఆయన కాలుకి గాయంతో ఉన్నారు. నేను ఇంటికి వచ్చానని తెలిసి నన్ను చూసి ఆయన పై నుంచి గబాగాబా కర్ర పట్టుకుని మెట్లపై నుంచి దిగుతూ వస్తున్నారు. అదేంటి ఏమైందని అడిగితే డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు కాలు చిన్న బెనికిందని, చిన్న గాయామే అలే అన్నారు. ఆ తర్వాత నాతో కాసేపు మాట్లాడారు. కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటున్నాం. అప్పుడు మాటల్లో ఆయన ఒకటి చెప్పారు. పొద్దున్నే లెవగానే నాకు అమ్మ మొహం కనపడాలమ్మా. నేను లెవగానే ఫస్ట్‌ అమ్మ ఫోటో చూస్తాను. నా బెడ్‌ రూంలో అమ్మ ఫోటో కూడా ఉంది" అని చెప్పారు.


ఆ తర్వాత నేను నమ్ముతానో లేదో అని, పైకి వెళ్లి మరీ అమ్మ  పోటో తెచ్చి చూపించారు. చాలా మంది మైండ్‌లో ఒకటి పెట్టుకుని ఒకటి మాట్లాడాతారు.. ఒకటి చేస్తారు. కానీ చిరంజీవి గారు అలా కాదు. ఏదైనా సరే జన్యున్‌గా ఉంటారు. అప్పుడు ఆయన జన్యునిటీ నా మనసుకు హత్తుకుంది. అందుకే ఈ బుక్‌ చిరంజీవి గారు తప్పితే ఎవరూ లాంచ్ చేయొద్దని డిసైడ్‌ అయ్యాను. ఆయన చేతుల మీదుగా అమ్మ బుక్‌ విడుదల చేయాలి అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది. ఇక అనంతరం ఈ బుక్‌ లాంచ్‌ ఈవెంట్‌కు చిరంజీవికి ఆహ్వానించేందుకు ఇంటికి వెళితే చీర  పెట్టారని, అదే చీర కట్టుకుని ఈ ఈవెంట్‌కు వచ్చానన్నానరు ఆమె. ఆ తర్వాత సావిత్రి క్లాసిక్స్‌ బుక్‌ను అమ్మ మన మధ్య ఉందనే ఫీలింగ్‌ రావాలని, నా కోసం.. మీ కోసం.. ఆమె అభిమానుల కోసం రాయించానని చెప్పారు. 



Also Read: వీడికి పోగరని తిట్టుకున్న పర్వలేదు, ఈసారి రూ.200 కోట్లు కొడుతా - 'లైగర్‌' ప్లాప్‌పై విజయ్‌ కామెంట్స్‌