దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్టర్‌గా ఎన్నో మర్చేపోలేదని, అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇక గత కొన్నేళ్లలో దర్శకత్వాన్ని పక్కన పెట్టి దర్శకత్వ పర్యవేక్షణ, నిర్మాణం లాంటి పనులను చూసుకుంటున్నారు అందులో భాగంగానే తాజాగా ఆయన నిర్మాణ సంస్థ ఆర్కే టెలీ షో‌ను స్టార్ట్ చేశారు. ఇది స్థాపించి 25 ఏళ్ల అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్కే టెలీ షో 25వ యానివర్సి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ త్వరలోనే హీరోగా నటిస్తున్న ‘సర్కారు నౌకరి’ చిత్ర టీజర్ కూడా ఈ వేడుకల్లోనే లాంచ్ అయ్యింది. 


గంగనమోని శేఖర్ ‘సర్కారు నౌకరి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో ఆకాష్‌కు జంటగా భావనా వళపండల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వేడుకలో  నిర్మాతలు సురేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ హెడ్ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. దర్శకేంద్రుడు స్థాపించిన ఆర్కే టెలీ షో ద్వారానే రాజమౌళి లాంటి సత్తా ఉన్న దర్శకులు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన మాత్రమే కాదు.. ఆయన లాగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకోవాలి అనుకునే ఎంతోమందికి ఆర్కే టెలీ షో ఒక అవకాశాన్ని అందించింది. 


సునీత ఎమోషనల్..
ఆర్కే టెలీ షో 25 ఏళ్ల వేడుకకు హాజరయిన వారందరూ దర్శకేంద్రుడితో తమకు ఉన్న అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఆయన ఎంతోమంది స్ఫూర్తినిచ్చారని అన్నారు.  సింగర్ సునీత తన కుమారుడు నటిస్తున్న మూవీపై మాట్లాడారు. రాఘవేంద్ర రావు సినిమాల్లో ఎన్నో పాటలు పాడానని గుర్తుచేసుకున్నారు. అంతే కాకుండా ఆర్కే టెలీ షో 25 ఏళ్ల వేడుకలో పాల్గొనడం చాలా ఎమోషనల్‌గా ఉందన్నారు. నంది అవార్డ్ లాంటి పురస్కారాలు అందుకున్నప్పుడు కూడా ఎమోషనల్ ఫీల్ అవ్వని తాను.. ఆ సందర్భంలో ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చారు. రాఘవేంద్ర రావు లాంటి వారు తన కుమారుడి సినిమాను నిర్మిస్తూ.. అతడిని హీరోగా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.


కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలి..
సునీత తనయుడు ఆకాష్ సైతం తనను హీరోగా పరిచయం చేస్తున్న రాఘవేంద్ర రావుకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు. తనకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుండే ఇంట్రెస్ట్ ఉండేదని బయటపెట్టాడు. ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు.. అవకాశం ఇచ్చేవాళ్లు కావాలని, ఆ అవకాశం రాఘవేంద్ర రావు ఇచ్చారని అన్నాడు. తాను ఆ వేదికపై ఉండడానికి తన అమ్మే కారణమని, తనే అమ్మే తన సర్వస్వం అని తెలిపాడు ఆకాష్. ఇక రాఘవేంద్ర రావు కూడా ఆర్కే టెలీ షోలో తనతో పాటు 25 ఏళ్లుగా ప్రయాణిస్తున్న వారందరికీ కంగ్రాట్స్ తెలిపారు. కార్యక్రమానికి ఎంతోమందిని పిలవాలనుకున్నా కుదరలేదని అన్నారు. తనలాగా ఇతర నిర్మాతలు కూడా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలని కోరారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.


Also Read: థియేటర్లలోకి వచ్చేస్తున్న క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’ - విడుదల ఎప్పుడంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial