ప్రియదర్శి కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా 'సారంగపాణి జాతకం'. మొదట డిసెంబర్ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అక్కడి నుంచి వాయిదా పడి ఏప్రిల్ మూడో వారానికి వచ్చింది. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల వాయిదా పడింది. ఒకందుకు ఇది మంచిదే అని చెప్పాలి.
ఏప్రిల్ 25న థియేటర్లలోకి సారంగపాణి!'జెంటిల్ మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా 'సారంగపాణి జాతకం'. ఏప్రిల్ 18న థియేటర్లలోకి సినిమాను తీసుకు రావడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. సెన్సార్ కూడా పూర్తి అయింది. అయితే... ఈ రోజు ఏప్రిల్ 25న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఓ వారం సినిమా వెనక్కి వెళ్ళింది. దీని వల్ల సినిమాకు ప్లస్ అని చెప్పాలి.
ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి...ఆ రెండిటితో సారంగపాణికి ఇబ్బంది లేదు!ఏప్రిల్ 17న తమన్నా ప్రధాన పాత్రలో నటించిన మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'ఓదెల 2' విడుదల కానుంది. ఆ తర్వాత రోజు... ఏప్రిల్ 18న నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలలో రూపొందిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' థియేటర్లలోకి రానుంది.
'ఓదెల 2', 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'తో పాటు 'సారంగపాణి జాతకం' చిత్రాన్ని విడుదల చేస్తే థియేటర్లు పంచుకోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రియదర్శి సినిమాకు తక్కువ థియేటర్లు వస్తాయి. షేరింగ్ వల్ల లాస్ ఉంటుంది. అదే ఏప్రిల్ 25కు సినిమా వెళితే ఆల్మోస్ట్ సోలో రిలీజ్ లభిస్తుంది. ఆ తేదీన విడుదల కావాల్సిన విష్ణు మంచు 'కన్నప్ప' వాయిదా పడడంతో ఏప్రిల్ 25 స్లాట్ ఖాళీగా ఉంది. ఇప్పుడు 'సారంగపాణి జాతకం' ఒక్కటే ఆ రోజు విడుదల కానున్న పెద్ద సినిమా. వెనక్కి వెళ్లడం వల్ల ప్రియదర్శితో పాటు చిత్ర బృందానికి లాభం అని చెప్పాలి.
Also Read:'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?