డాక్టర్ సమరం.... సారీ సారీ భ్రమరం పాత్రలో ప్రముఖ హాస్య నటుడు 'వెన్నెల' కిశోర్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భ్రమరం బదులు సమరం అని ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే సినిమా టైటిల్ 'సంతాన ప్రాప్తిరస్తు'. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రమిది. ఇవాళ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 

Continues below advertisement

నవంబర్ 14న థియేటర్లలోకి సినిమా!Santhana Prapthirasthu Movie Release Date: ఇప్పటి వరకు విడుదలైన 'సంతాన ప్రాప్తిరస్తు' లిరికల్ సాంగ్స్, అలాగే టీజర్ సినిమాకు ప్రేక్షకుల్లో కావాల్సినంత బజ్ క్రియేట్ చేశాయి. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. చిల్డ్రన్ డే సందర్భంగా నవంబర్ 14న వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ కానుందని దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు.

Also Read: లక్స్‌ పాపను పంపించేశారు... ఇమ్మూ చేతుల్లోనే పవర్ అంతా... పవర్ అస్త్రా రీతూ చౌదరి కోసమా?

Continues below advertisement

ప్రస్తుత సమాజంలో యూత్ కపుల్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒక దానిని తీసుకుని 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమా తీశారు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ సంస్థలపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు.

Also Readబిగ్‌బాస్ డే 33 రివ్యూ... వరస్ట్ ప్లేయర్ to కెప్టెన్సీ బ్యాండ్ వరకు కళ్యాణ్... దివ్యకు తనూజ వెన్నుపోటు... ఇమ్మూను బకరాను చేసిన హీరోయిన్

Santhana Prapthirasthu Movie Cast And Crew: విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాలో 'వెన్నెల' కిషోర్ ప్రధాన పాత్ర చేశారు. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, 'తాగుబోతు' రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీలా, సద్దాం కీలక తారాగణం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎ మధుసూదన్ రెడ్డి, ఛాయాగ్రహణం: మహి రెడ్డి పండుగుల, మాటలు: కల్యాణ్ రాఘవ్, నృత్య దర్శకత్వం: లక్ష్మణ్ కాళహస్తి, కాస్ట్యూమ్ డిజైనర్లు: అశ్వత్ భైరి - కె ప్రతిభ రెడ్డి,కథ - కథనం: సంజీవ్ రెడ్డి - షేక్ దావూద్ జి, స్వరాలు: సునీల్ కశ్యప్, నేపథ్య సంగీతం: అజయ్ అరసాడ, నిర్మాతలు: 'మధుర' శ్రీధర్ రెడ్డి - నిర్వి హరిప్రసాద్ రెడ్డి, దర్శకత్వం: సంజీవ్ రెడ్డి.