Sankranthi Special A Mega Melody for Mega Princess KlinKaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఈ జంటకు ఆడపిల్ల జన్మించింది. గత ఎడాది జూన్ 20న ఉపాసన పాపకి జన్మనిచ్చింది. మెగా ఇంటికి మహాలక్ష్మి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెకి 'క్లింకారా' అని నామకరణం చేశారు. మెగాస్టార్ కుటుంబానికి ఇష్టమైన మంగళవారం రోజున ఆడపిల్ల పుట్టడంతో మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెళ్లి విరిసాయి. 'క్లింకారా' అంటే లలిత సహస్రనామాల్లో బీజాక్షరం. ప్రకృతికి శక్తికి ప్రతిరూపం అని అర్థం.


మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని ఈ పేరు సూచిస్తుంది. ఇక చరణ్, ఉపాసన దంపతులు కూతురితో ఈ సంక్రాంతిని మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. గత నాలుగు రోజులుగా బెంగళూరులోని ఫామ్ హౌస్ లో మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి అల్లు ఫ్యామిలీ కూడా తోడైంది. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఉపాసన ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేస్తూ వస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా, అల్లు కుటుంబాలు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఫోటో ఫ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుంది.


ఇదిలా ఉంటే చరణ్ - ఉపాసన గారాలపట్టి క్లింకారపై ఓ పాటను సిద్ధం చేశారు. మెగా అభిమానులు సంక్రాంతి కానుకగా ఈ పాటను ఉపాసన స్వయంగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహావీర్ ఎల్లంధర్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ కు తగ్గట్టుగా బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ అందించారు. సింగర్ ధనుంజయ్ ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించాడు. కాగా ఈ సాంగ్లో క్లింకారా పుట్టినప్పుడు హాస్పిటల్ లోని క్షణాల నుంచి మొన్నటి బారసాల వరకు ప్రతి మూమెంట్ కవర్ చేసి చూపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.


గతంలో సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాల భైరవ కూడా క్లింకారా కోసం ఓ ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేశారు. ఇక ఇప్పుడు స్వయంగా మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ కూతురి కోసం మరో సాంగ్ చేయడం విశేషం. కాగా ఇప్పటివరకు క్లింకారా ముఖాన్ని చూపించకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్త పడుతోంది. నిన్న సంక్రాంతి సందర్భంగా దిగిన ఫోటోల్లోనూ ముఖం కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. మరి ఆమె ముఖాన్ని అభిమానులకు ఎప్పుడు పరిచయం చేస్తారో చూడాలి. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది వేసవి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : సమ్మర్‌కి షిఫ్ట్ అయిన విక్రమ్ 'తంగలాన్' - రిలీజ్ ఎప్పుడంటే?