సంక్రాంతికి వస్తున్న హీరోలలో విక్టరీ వెంకటేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. వాళ్ళిద్దరితో పాటు నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా వస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... చరణ్, వెంకీ మామతో సినిమాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాత ఒక్కరే - 'దిల్' రాజు. తన సినిమాకు తన సినిమానే పోటీ దింపుతున్నారా? అని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. అయితే... చరణ్ సినిమాతో ఎటువంటి ఇష్యూ లేకుండా గ్యాప్ మైంటైన్ చేస్తున్నారు వెంకీ మామ.
సంక్రాంతి బరిలో వెంకీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా ఆయనకు 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunam). ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు విడుదల గురించి కూడా ఇటీవల క్లారిటీ ఇచ్చారు.
'దిల్' రాజు ప్రొడ్యూస్ చేసిన పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer) తొలుత క్రిస్మస్ సీజన్ టార్గెట్ చేస్తూ డిసెంబర్ 20న విడుదల చేయాలని ప్లాన్ చేసినా... చివరకు సంక్రాంతికి వాయిదా వేయడంతో వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదల వాయిదా పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అటువంటిది ఏమీ లేదని స్పష్టత ఇచ్చేశారు. ఆ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే ఉందని చెప్పేశారు. అయితే... రామ్ చరణ్ (Ram Charan) సినిమాతో ఎటువంటి ఇష్యూ లేకుండా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు వెంకీ మామ.
జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను థియేటర్లలోకి తీసుకు రావడానికి డిసైడ్ అయ్యారు. అంటే... చరణ్ సినిమా వచ్చిన నాలుగు రోజులకు వెంకీ సినిమా వస్తుంది అన్నమాట. 'గేమ్ చేంజర్' జనవరి 10న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. సో... ఆ సినిమా ఓపెనింగ్స్ వరకు వెంకీ మామ సినిమా నుంచి ఎటువంటి కాంపిటీషన్ ఉండదు. మరి బాలకృష్ణ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చూడాలి.
Also Read: కేతికా శర్మలో మరీ ఇంత అందమా... ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వైరల్ ఫొటోస్ చూశావా మామా
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ భార్య పాత్రలో నటించగా... హీరో మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి కనిపించనుంది. గేమ్ చేంజెస్ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించగా... ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకు తెలుగు అమ్మాయి అంజలి సందడి చేయనుంది. తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేస్తూ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా థియేటర్లలోకి వస్తుండగా... పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ 'గేమ్ చేంజర్' బరిలో దిగుతుంది. ఆ సినిమా టీజర్ ఈ నెల 9వ తేదీన ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో విడుదల చేయనున్నారు. సో తెలుగు మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ మాత్రమే 'గేమ్ చేంజర్' సినిమాకు ముఖ్యం కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లు రావాల్సిన అవసరం ఉంది.
Also Read: రెండు పార్టులుగా సాయి పల్లవి - రణబీర్ రామాయణం... దీపావళికి థియేటర్లలో రావణాసుర వధ