Prabhas: కథలు అద్భుతంగా రాస్తారా... అయితే ప్రభాస్ బంఫర్ ఆఫర్ మీలాంటి టాలెంటెడ్ రైటర్స్ కోసమే

సినిమా పరిశ్రమలో రాణించాలని చాలా మంది కథా రచయితలు భావిస్తారు. అయినప్పటికీ సరైన అవకాశం రాక ఇబ్బంది పడుతారు. అలాంటి వారి కోసం ప్రభాస్ బంఫర్ ఆఫర్ ఇచ్చారు.

Continues below advertisement

Prabhas Offer: సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది వస్తుంటారు. పోతుంటారు. కొంత మందే నిలదొక్కుకుంటారు. చాలా మందికి అసలు అవకాశాలు రాక ఇబ్బంది పడుతుంటారు. తమ కలను నిరూపించుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఛాన్సులు రారు. వస్తాయనే ఆశ లేక నిరాశతో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. టాలెంట్ ఉన్నా, అవకాశాలు రాని వారి కోసం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అదిరిపోయే అవకాశం కల్పిస్తున్నారు. యువ రచయితలకు, దర్శకులకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నారు. ఇంతకీ ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటంటే?

Continues below advertisement

‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’లో మీ కథలు అప్ లోడ్ చేయండి!

ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్, తన అన్న ప్రమోద్ తో కలిసి ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ అనే సంస్థను స్థాపించారు. తాజాగా ఈ సంస్థకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కథా రచయితలు, దర్శకులకు అవకాశం కల్పించబోతున్నట్లు వెల్లడించారు. ఐదు భాషల్లో ఈ ప్రకటన ఇచ్చారు. ఇంతకీ ఈ వీడియోలో ఏం చెప్పారంటే..  “మీ దగ్గర మంచి కథలు ఉన్నప్పటికీ అవకాశాలు రావడం లేదా? మీ లాంటి వారి కోసమే మేం ఒక వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆ వెబ్ సైట్ లో మీ కథను అప్ లోడ్ చేయండి. ఆ కథలను ప్రేక్షకులను చూస్తారు. ఎక్కువ మందికి నచ్చిన కథలను ఎంపిక చేస్తాం. వాటిని సినిమాగా తీసుకొస్తాం” అని వెల్లడించారు. ఈ వీడియోను పలు భాషల్లో విడుదల చేశారు. ఈ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఆసక్తి ఉన్న కథా రచయితలను నుంచి మంచి కథలు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ మీకూ ఇండస్ట్రీలో రాణించాలని ఆసక్తిగా ఉంటే, ట్రై చేసుకోవచ్చు. కథా రచయితగా, దర్శకుడిగా ప్రయత్నించవచ్చు.  www.thescriptcraft.com వేదికగా మీ కథలను పంపుకోవచ్చు. అదృష్టం బాగుంటే అవకాశం లభించవచ్చు. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇండస్ట్రీలోకి కొత్త వారికి స్వాగతం పలకాలనే ఆలోచన చాలా గొప్పదంటున్నారు.  

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. పలువురు సీనియర్ దర్శకులతో పాటు  కొత్త డైరెక్టర్స్ తోనూ సినిమాలు చేస్తున్నారు.  ప్రస్తుతం ఆయన చేతిలో ఏకంగా 5 సినిమాలు ఉన్నాయి. ‘కన్నప్ప’, ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి 2898 AD’ 2 లాంటి సినిమాలు చేస్తున్నారు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్‌’ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నారు. అటు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా చేస్తున్నారు. మిగతా సినిమాలకు సంబంధించి త్వరలోనే వివరాలను వెల్లడికానున్నాయి.  

Read Also: రష్మీని ఆడుకున్న బుల్లెట్ భాస్కర్... శివాజీ పెద్ద ఆటగాడు అంటోన్న నూకరాజు

Continues below advertisement