అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో మోస్ట్ వయోలెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇందులో 'యానిమల్' మూవీ భారీ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై కొంతమంది సినీ ప్రముఖులు విమర్శలు గుప్పించారు. ఇందులో తీవ్ర హింస, స్త్రీలను తక్కువ చేసి చూపించడం వంటి సన్నివేశాలపై అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే మూవీ రిలీజ్ అయినప్పటి నుంచే వినిపిస్తున్న ఈ విమర్శలపై సందీప్ రెడ్డి వంగా ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా 'కబీర్ సింగ్' సినిమాలో నటించాడనే కారణంతో ఒక సపోర్టింగ్ యాక్టర్ కు పెద్ద నిర్మాణ సంస్థ ఒప్పుకోలేదనే షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.

'కబీర్ సింగ్' వల్ల నటుడికి ఎదురుదెబ్బ  

టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' మూవీతో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ లో ఇదే మూవీని 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించారు. అయితే 'కబీర్ సింగ్' సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన ఓ నటుడికి బడా బాలీవుడ్ నిర్మాణ సంస్థ తమ సినిమాలో నటించే ఛాన్స్ ఇవ్వలేదని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా విమర్శించారు. అయితే ఆయన సదరు నిర్మాణ సంస్థ లేదా నటుడి పేరు బయట పెట్టలేదు. ఆ నటుడి పట్ల ఇలా పక్షపాతంతో వ్యవహరించినందుకు చిరాకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 

రీసెంట్ గా కోమల్ నహతాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా 'కబీర్ సింగ్'లో నటించిన నటుడిని ఎందుకు రిజెక్ట్ చేశారో వివరించారు. ఇలా అన్యాయంగా వ్యవహరించడంపై సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ మండిపడ్డారు. మెయిన్ యాక్టర్స్ కు కూడా ఈ రూల్స్ వర్తించాలని అన్నారాయన. సదరు సపోర్టింగ్ యాక్టర్ తన అవకాశం ఎలా చేజారింది అన్న విషయాన్ని సందీప్ రెడ్డి వంగాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పాడట. ఆ టైమ్ లో సందీప్ సదరు నటుడితో "ఒకవేళ అదే గనుక ప్రాబ్లం అయితే... నువ్వు తిరిగి వెళ్లి సందీప్ ఇప్పుడు రణబీర్ కపూర్ తో కలిసి సినిమా చేయబోతున్నాడని చెప్పు" అని అన్నారట. 

Also Read: 'మజాకా' రివ్యూ: పార్టులు పార్టులుగా చూస్తే కామెడీ సీన్లు ఓకే... మరి సినిమా? సందీప్ కిషన్, రావు రమేష్ కలిసి విసిగించారా? నవ్వించారా?

ఆ నిర్మాణ సంస్థ తీసేది 'అవతార్' కాదు 

ఆ షాకింగ్ సంఘటన గురించి సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ "అలా అనుకునే వారు రణబీర్ కపూర్, త్రిప్తి దిమ్రి, రష్మిక మందన్న వంటి నటీనటులను కూడా వాళ్ళ సినిమాల్లో తీసుకోవద్దు. నాకోసం ఆ పాట రాసిన విశాల్ మిశ్రాలతో కలిసి కూడా పని చేయొద్దు. ధైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడాలి. సదరు నటుడికి అలా అవకాశం చేజారిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది. అతను ఎక్కడి నుంచో సినిమా ఇండస్ట్రీకి వచ్చి, ఒక చిన్న పాత్ర పోషించాడు. దానివల్ల కాస్త గుర్తింపు దక్కింది. అదే జోష్ తో ముందుకు వెళ్దాం అనుకుని ఆడిషన్ ఇస్తే, నువ్వు ఆ సినిమాలో పని చేశావు కాబట్టి మా కంపెనీ నేను తీసుకోదు అని అంటున్నారు. అయితే ఆ కంపెనీ ఏమి అవతార్ సినిమా తీయట్లేదు. కాబట్టి ఆ నటుడిని లైట్ తీసుకోండి అని చెప్పాను" అంటూ ఫైర్ అయ్యారు సందీప్ రెడ్డి వంగా. 

విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాతో సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. హిందీలో ఇదే సినిమాను 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశారు. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో 2023లో ఆయనకు 'యానిమల్' తీసే ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ తో 'స్పిరిట్' అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Readసమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్