Animal Movie : ఈ ఏడాది సౌత్ నుంచి బాలీవుడ్ లో బాగా వినిపించిన డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగా ఇప్పుడు 'యానిమల్' తో బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత నెగటివ్ టాక్ వచ్చినా యానిమల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.860 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.


సినిమా భారీ సక్సెస్ అవ్వడంతో సందీప్ వంగా ఈ మూవీ సక్సెస్ ని తెగ ఎంజాయ్ చేస్తూ బాలీవుడ్ లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూల్లో సందీప్ చేసిన కామెంట్స్ నిత్యం వార్తల్లోకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ‘యానిమల్’పై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ మరోసారి సెన్సేషనల్ కామెంట్ చేశారు సందీప్ రెడ్డి వంగ. రీసెంట్ గానే బాలీవుడ్ సినీ క్రిటిక్స్ పై సందీప్ చేసిన విమర్శలు ఎంత హాట్ టాపిక్ అయ్యాయో తెలిసిందే.


బాలీవుడ్లో కొందరు ఇచ్చిన నెగిటివ్ రివ్యూ వల్ల తన సినిమాకి అన్యాయం జరిగిందని సందీప్ రెడ్డి వంగా అన్నాడు. ఇదే విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "విమర్శల వల్ల సినిమాపై ప్రతికూలత ఏర్పడుతుంది. ఎక్కువసార్లు అబద్దాన్ని చెబితే అదే నిజమనిపిస్తుంది. సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతుంది. సినిమా చూసి అన్ని నేర్చుకోవడానికి అది పాఠశాల కాదు కదా. అయినా తరగతి గదుల్లో, తల్లిదండ్రుల నుంచి మంచి చెడులు తెలుసుకోలేని వాళ్ళు సినిమా చూసి నేర్చుకుంటారని నేను ఏమాత్రం అనుకోను. ఈరోజుల్లో ప్రజలు చాలా సెన్సిటివ్ గా మారుతున్నారు. సినిమాల పట్ల వాళ్లు ఎందుకంత సెన్సిటివ్ గా ఉంటారో నాకు తెలియదు. సినిమాల పట్ల ఉండే రియాక్షన్ వాళ్లకు ఇతర డిపార్ట్మెంట్స్ లో లేదు. దేవుడి దయ నేను పడ్డ కష్టం వల్ల నా మూడు సినిమాలు విజయం సాధించాయి. నేను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. అందుకే నా సినిమాలను కూడా ఆ స్థాయి వాటితోనే పోల్చుకుంటాను. అందుకే విమర్శలపై పెద్దగా దృష్టి పెట్టను" అని చెప్పుకొచ్చాడు.


ఇతర డైరెక్టర్స్, రైటర్స్ తో పోలిస్తే ఈ రైటింగ్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటని అడిగినప్పుడు అందుకు సందీప్ బదులిస్తూ.. "నా సినిమా డార్క్ గా ఉందని ఎవరైనా చెప్పినప్పుడు నేను దాన్ని ప్రపంచ స్థాయి సినిమాతో పోలుస్తాను. అలా పోల్చి చూస్తే నేను యావరేజ్ అని భావిస్తాను. కాబట్టి ఆ స్థాయికి చేరుకోవాలి అనుకుంటున్నాను. ఉదాహరణకు ఒకవేళ యానిమల్ కలెక్షన్స్ రూ.350 కోట్ల దగ్గర ఆగిపోయినట్లయితే విమర్శకులంతా దీన్ని ప్లాప్ అని ప్రకటించేవాళ్లు. నా దృష్టిలో రూ.100 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా రూ.140 కోట్లు వసూలు చేసిన అతి హిట్ అయినట్లే. కానీ విమర్శకులు మాత్రం ప్రేక్షకాదరణ పొందలేదని ప్రచారం చేస్తుంటారు" అని చెప్పాడు సందీప్ రెడ్డి వంగా.


Also Read : ‘యానిమల్’ ఓటీటీ వెర్షన్‌లో అదనంగా ఆ 9 నిమిషాల సీన్స్ - క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా