మంత చాలా రోజుల నుంచి మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తన అనారోగ్యం వల్ల ఆమె తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లను కూడా చేజార్చుకుందని ఈ మధ్య చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో.. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్ డైరెక్టర్లు రాజ్-డీకే రూపొందిస్తున్న మరో సీరిస్ ‘సిటిడెల్’ నుంచి ఆమె తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

  


స్పై థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నఈ సిరిస్‌‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో సమంత కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు దర్శక నిర్మాతలకు ప్రకటించారు. అయితే, అనారోగ్యం కారణంగా సమంత మూడు నెలలు కంప్లీట్ గా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని,  అందుకే ఈ సిరిస్‌లో నటించే అవకాశాన్నివదులుకుందని వార్తలు వచ్చాయి.


సమంతా స్థానంలో కొత్త హీరొయిన్ ను తీసుకోబోతున్నారని, ఆమె కొన్నాళ్లు సినిమాలకు కూడా దూరం కానుందనే సమాచారం దావనంలా వ్యాపించింది. దీనిపై సమంత సన్నిహితులు స్పందించారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలని, ‘సిటిడెల్’లో సమంతా నటించనుందని తెలిపారు. జనవరి రెండో వారం నుంచి రాజ్ డీకే ప్రాజెక్ట్ షూటింగ్ లో సమంత పాల్గొనుందని పేర్కొన్నారు. 


ఇటివల 'యశోద' సినిమాతో ప్రేక్షకులను అలరించినా సమంతా ఆ మూవీ ప్రమోషన్లో తను మయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్నీ అభిమానులతో పంచుకుంది. ఆ తరువాత నుంచి సమంతా సినిమాలకు బై చెప్పనుందా లేదా? లేక కొంత కాలం  సినిమాలకు విరామం తీసుకోనుందా? అనే అనుమానాలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొట్టాయి. తన జబ్బు కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందని అని తెలిసినా.. సమంతా ఇక సినిమాలు చెయ్యదనే వార్తలు రావడం ఏంటని? చాలా బాధాకరమని అభిమానులు వాపోతున్నారు.


రీ-ఎంట్రీకి సిద్ధమేనా?




సినిమాలకు తను కొంత కాలం గ్యాప్ తీసుకోబోతున్న అనే వార్తలు అవాస్తవం అని చెప్పడానికి.. సమంత న్యూ ఇయర్ సందర్భంగా పెట్టిన సోషల్ మీడియా పోస్టే నిదర్శనం అని అభిమానులు అంటున్నారు. ముందుకు సాగిపోదాం.. మనకు సాధ్యమైనంత పనిచేద్దాం.. అంటూ న్యూ ఇయర్ విషెస్ ను ఫాన్స్ తో పంచుకుంది సమంత. 2022లో ఇండియన్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్ గా మొదటి స్థానంలో నిలిచిన సమంతా  ‘సిటిడెల్’ వెబ్ సీరిస్‌లోనే కాకుండా.. విజయ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమాలోనూ నటిస్తోంది. గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న 'శాకుంతలం' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : ఇక్కడ చైతన్య - సమంత, అక్కడ రితేష్ - జెనీలియా... ఇది కలెక్షన్ల 'మజిలీ'