Happy Birthday Samantha Ruth Prabhu: ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా మొత్తం తన బర్త్ డే విషెస్‌తో నింపేశారు. కానీ ఎవరూ తన అప్‌కమింగ్ మూవీస్ నుంచి అప్డేట్ మాత్రం ఆశించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం సమంత చేతిలో పెద్దగా సినిమాలు లేవని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఊహించని విధంగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇస్తూ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది సామ్. సమంత ఇలాంటి ఒక అప్డేట్ ఇస్తుందని ఎవరూ ఊహించకపోవడంతో ప్రేక్షకులు సైతం ఈ పోస్టర్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. పోస్టర్‌తో పాటు టైటిల్‌ను కూడా రివీల్ చేసింది సమంత.
హౌజ్ వైఫ్‌గా..
‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్‌తో చీర కట్టుకొని, గన్ పట్టుకొని చాలా అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తోంది సమంత. అయితే ఈ పోస్టర్ సినిమాకు సంబంధించిందా? వెబ్ సిరీస్‌కు సంబంధించిందా? అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ ప్రాజెక్ట్‌లో మరో విశేషం ఏంటంటే దీనిని సమంత తన సొంత బ్యానర్ అయిన త్రలాలా మూవీ పిక్చర్స్ ద్వారా నిర్మిస్తోంది. ‘బంగారం’ పోస్టర్‌ను బట్టి చూస్తే ఇందులో సమంత ఒక హౌజ్ వైఫ్ అని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ఇది ఒక హౌజ్ వైఫ్ కథ అని, లేడీ ఓరియెంటెడ్ చిత్రమని అర్థమవుతోంది. ఇక ఇలాంటి ఒక ఆసక్తికర పోస్టర్ బయటికి రావడంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పుడు బయటికొస్తాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇంట్రెస్టింగ్ క్యాప్షన్..
‘మెరిసిందల్లా బంగారం కాదు’ అంటూ ‘బంగారం’ మూవీ పోస్టర్‌ను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను జతచేసింది సామ్. దాంతో పాటు ‘ఏదో జరగబోతుంది’ అంటూ నవ్వుతున్న ఇమోజీ కూడా జతచేసింది. సమంత పుట్టినరోజు అయినా కూడా తన నుండి ఎలాంటి అప్డేట్స్‌ను ఆశించని ఫ్యాన్స్.. ఈ పోస్టర్‌ను చూసి సామ్ ఇలా సస్పెన్స్‌లో పడేసింది ఏంటి అని చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఎక్కువగా ఆలోచించకుండా ఈ ప్రాజెక్ట్ విషయంలో సామ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మొత్తానికి సమంతను మళ్లీ వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇది చాలా గుడ్ న్యూస్.
ఆ అప్డేట్ లేదు..
సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత తను ఇంకా ఏ కొత్త ప్రాజెక్ట్‌ను ఓకే చేయలేదని తెలిసిన విషయమే. ప్రస్తుతం తన చేతిలో ‘సిటాడెల్’ అనే అమెరికన్ వెబ్ సిరీస్‌కు తెలుగు వర్షన్ మాత్రమే ఉంది. దీనికి ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు కొన్నిరోజుల క్రితం మేకర్స్ ప్రకటించారు. ఇక త్వరలోనే ఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ ప్రేక్షకుల ముందుకు కూడా రానుందని రివీల్ చేశారు. ఏప్రిల్ 28న సమంత బర్త్ డే కావడంతో ‘సిటాడెల్: హనీ బన్నీ’ నుండే ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఊహించారు ప్రేక్షకులు. కానీ అనూహ్యంగా ‘బంగారం’ అనే అప్డేట్‌తో వచ్చింది సామ్.