Samantha Raj Nidimoru In Single Car: స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే రూమర్స్ గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తుండగా... వీటిని సమంత టీం ఖండించారు. 'శుభం' సక్సెస్ తర్వాత సమంత వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వెకేషన్‌లోనూ డైరెక్టర్ రాజ్ ఉన్నారనే వార్తలు వచ్చాయి. వీటికి బలం చేకూరేలా కొద్ది రోజుల క్రితం ఓ ఫోటో వైరల్ అవుతోంది.

ఒకే కారులో సమంత, రాజ్

తాజాగా, వీరిద్దరూ ఒకే కారులో వెళ్తూ మీడియా కంటపడ్డారు. సమంత వైట్ డ్రెస్‌లో నవ్వుతూ బయటకు రాగా... రాజ్ నిడిమోరు సైతం క్యాజువల్‌గా కనిపించారు. ఇద్దరూ ఒకే కారులో ఎక్కగా ఫోటోగ్రాఫర్స్ క్లిక్‌మనిపించారు. వీరు రెస్టారెంట్‌కు వెళ్లారనే టాక్ వినిపిస్తంో. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు లవ్ సింబల్స్, ఎమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 'కింగ్‌డమ్‌' ట్విట్టర్ రివ్యూ: విజయ్ దేవరకొండ బొమ్మ బ్లాక్ బస్టరేనా? ప్రీమియర్స్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

'శుభం' మూవీ సక్సెస్ తర్వాత సమంత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఈ మూవీ ప్రమోషన్స్, సక్సెస్ ఈవెంట్‌ ఫోటోస్‌లో రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించగా... డేటింగ్‌ వార్తలు హల్చల్ చేశాయి. ఆ తర్వాత సమంత వెకేషన్ ట్రిప్‌ ఫోటోస్‌లోనూ ఆయన కనిపించారు. దీనిపై ఇప్పటివరకూ ఇద్దరూ రియాక్ట్ కాలేదు. రాజ్ భార్య శ్యామాలి మాత్రం సోషల్ మీడియా వేదికగా పలు కోట్స్ పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. వీటిల్లో సమంత పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా అవి ఆమెను ఉద్దేశించే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.

అమెరికా వీధుల్లో...

ఇటీవల సమంత అమెరికాలో తెలుగు ప్రేక్షకులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనగా... ఆ టీంలో రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు. డెట్రాయిట్ సిటీలో ఫోటోలను సమంత షేర్ చేయగా... ఓ ఫోటోలో రాజ్‌తో కలిసి చేతిలో చేయి వేసి ఆమె కనిపించారు. మరో ఫోటోలో ఓ రెస్టారెంట్‌లో ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కనిపించారు. తాజాగా... ఇప్పుడు మళ్లీ ఒకే కారులో కలిసి వెళ్లడం ఆ రూమర్లకు బలం చేకూరినట్లయింది.

'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2లో సమంత (Samantha) నటించగా... దీనికి రాజ్ (Raj Nidimoru) దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ చేశారు. ఈ టైంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' వెబ్ సిరీస్ చేస్తుండగా... దీనికి రాజ్ అండ్ డీకే షో రన్నర్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్‌లతో పాటు 'మా ఇంటి బంగారం' మూవీలోనూ సమంత నటిస్తున్నారు.