సినిమాలు మాత్రమే కాదు... స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) వ్యక్తిగత జీవితం సైతం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ నుంచి మొదలు పెడితే మ్యారిటల్ లైఫ్ వరకు ప్రతిదీ హెడ్ లైన్స్ టాపిక్కే. ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు (Samantha Birthday). అందుకని, ఆ రోజు ఆమెకు ఎంతో ప్రత్యేకం. స్పెషల్ డే కంటే రెండు రోజుల ముందు సోషల్ మీడియాలో సమంత ఓ పోస్ట్ చేశారు. అందులో కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలపై ఆమె రాసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వాటిలో అంత సెన్సేషన్ ఏముంది? అంటే... 'బర్త్ డే వీక్' అంటూ గతేడాదిలో తన జీవితంలో జరిగిన మార్పుల గురించి సమంత రాసుకొచ్చారు.
సమంతతో పాటు ఏముంది?వదిలేసినది ఏమిటి? పోయిందేమిటి?తనతో ఉన్నది ఏమిటి? తన నుంచి వెళ్ళిపోయినది ఏమిటి? లేదా వదిలేసినది ఏమిటి? అనేది సమంత వివరించారు. సూటిగా, స్పష్టంగా ఫలానా టాపిక్ అంటూ ఆమె ప్రస్తావించలేదు. కానీ, తన ప్రయాణంలో జరిగిన అంశాలను మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు.
ప్రారంభం (ది బిగినింగ్) గురించి చెప్పాలంటే... అప్పట్నుంచి తనతో ఉన్నది తాను చేసే పని మీద ప్రేమ, తనను ముందుకు నడిపించే డ్రైవింగ్ ఫోర్స్ అని... ఆ రెండూ తనతో ఉన్నాయని సమంత తెలిపారు. ఎంపిక చేసుకోవడం కోసం వేచి చూసే లక్షణాన్ని వదిలేశానని ఆమె పేర్కొన్నారు.
ప్లాన్ చేసిన విధంగా పనులు ముందుకు వెళ్లని తరుణంలో తన మనసు చెప్పేది వినడం లేదా తన ప్రవర్తన మాత్రం మారలేదని సమంత వివరించారు. తనను కంట్రోల్ చేసే ఐడియాను మాత్రం వదిలేశానని పేర్కొన్నారు.
మే 15వ తేదీన 'మా ఇంటి బంగారం'తో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సమంత వస్తున్నారు. ఆ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేటివ్ డైరెక్టర్. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను అలరించాయి.
Also Read: Anugraha Nambiar - 'రిసార్ట్'లో అనుగ్రహ నంబియార్... మోసం చేశారని నటి ఆవేదన
