టాలీవుడ్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి (MS Subbulakshmi Biopic) జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు టాలీవుడ్ సిద్దం అవుతోంది. ఈ మూవీని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi) ని హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే సాయి పల్లవి మాత్రం తన చిత్రాలతో బిజీగా ఉంటోంది. ఆమె డేట్స్ దొరక్క ఈ ప్రాజెక్ట్‌ని ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నారు.

Continues below advertisement

సాయి పల్లవి బదులు రుక్మిణి?సాయి పల్లవి ప్రస్తుతం హిందీ సినిమాలతోనే బిజీగా ఉన్నారు. అయితే ఇక సాయి పల్లవి ఇంకా డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోందని సమాచారం. సాయి పల్లవి ప్రస్తుతం రామాయణ, మణిరత్నం ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి డేట్స్ దొరకడం లేదని రుక్మిణి వసంత్‌ (Rukmini Vasanth) ని మేకర్స్ సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అసలే ఇప్పుడు రుక్మిణికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్, డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రేజీ ప్రాజెక్టుల్లో ఆమెను మన మేకర్స్ లాక్ చేశారు. ఇక ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రుక్మిణి ఇంకా పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని అనుకుంటున్నారట.

See Photos: Ashu Reddy - కొల్హాపూర్ అమ్మవారి చెంతకు అషురెడ్డి... వెడ్డింగ్ కాంట్రావర్సీ, ఎన్నారై కేసు తర్వాత ఫస్ట్ ఫోటోలు

Continues below advertisement

అందుకే రుక్మిణిని ఫైనల్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. రుక్మిణి అయితే డేట్స్‌ను ఈజీగా సర్దుబాటు చేస్తుందని అనుకుంటున్నారట. ఇక ఈ మూవీని గీతా ఆర్ట్స్ భారీ ఎత్తున నిర్మించేందుకు రెడీ అవుతోందట. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారట. దాదాపు అక్టోబర్ వరకు షూటింగ్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

Also ReadLaggam Time Review - 'లగ్గం టైమ్' రివ్యూ: ఆహా ఓటీటీలో కొత్త లవ్ స్టోరీ... సినిమాను చూడగలమా?

'కింగ్డమ్' మూవీతో గౌతమ్ తిన్ననూరికి మిశ్రమ ఫలితం వచ్చిన సంగతి తెలిసిందే. కింగ్డడ్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న గౌతమ్ ఇప్పుడు మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Also ReadKara First Review: కర ఫస్ట్ రివ్యూ... ధనుష్ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారంటే?