సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఏకంగా 6 నెలల్లో 3 సినిమాల్లో కనిపించబోతున్నాడు అన్న వార్త సల్లూ భాయ్ అభిమానులకు గుడ్ న్యూస్ గా మారింది. మరి ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేస్తున్న సినిమాలు ఏంటి? ఆయన నెక్స్ట్ ఆరు నెలల్లో కనిపించబోతున్న సినిమాల లిస్ట్ ఏంటి? అనే విషయాలను చూసేద్దాం పదండి.


సల్మాన్ ఫ్యాన్స్ వెయిటింగ్ కు ఎండ్ కార్డ్ 
ప్రస్తుతం స్టార్ హీరోలు అంతా ఒక్క సినిమా చేయడానికి ఏళ్ల తరబడి టైం తీసుకుంటున్నారు. యంగ్ హీరోలు అయితే ఫ్యాన్ ఇండియా పేరుతో ఏకంగా ఒకటి నుంచి రెండు మూడేళ్లు కాలం గడిపేస్తున్నారు. ఇక సీనియర్ హీరోలు అయితే ఏడాదికి ఒక్క సినిమాతో సరిపెట్టేస్తున్నారు. చిన్న హీరోలు కొంతమంది మాత్రం ఏడాదికి నాలుగు సినిమాలతో దూసుకెళ్తున్నారు. కానీ తాజాగా సల్మాన్ ఖాన్ స్పీడ్ చూస్తే యంగ్ హీరోలు జెలసిగా ఫీల్ అవ్వడం ఖాయం. ఆయన ఏకంగా 6 నెలల్లో 3 సినిమాల్లో కనిపించబోతుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సినిమాలన్నీ ఇటీవల కాలంలో పర్లేదు అన్నట్టుగానే రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. 2023 లో ఆయన నటించిన 'కిసీకకా భాయ్ కిసికా జాన్', 'టైగర్ 3' సినిమాలు ఓకే ఓకే అన్నట్టుగానే ఆడాయి. దీంతో సల్మాన్ ఖాన్ నెక్స్ట్ మూవీని చేయడానికి కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఇక ఆయన సినిమాలు రిలీజ్ కావాలంటే వచ్చే ఏడాది ఈద్ వరకు వెయిట్ చేయక తప్పదు అన్న వార్తలు విన్పించడంతో అభిమానులు నిరాశ చెందారు. ముఖ్యంగా ఈ ఏడాది ఈద్ కు సల్మాన్ సినిమా లేకపోవడంతో ఆయనను చాలా మిస్ అయ్యారు ఫ్యాన్స్. కానీ తాజాగా సల్మాన్ అభిమానుల్లో జోష్ పెంచే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఇక నుంచి థియేటర్లలో ఆయన వరుసగా సందడి చేయనున్నారు.  ప్రస్తుతం సల్లు భాయ్ ఖాతాలో బాబీ జాన్, సికందర్, సింగం అగైన్, అట్లి మూవీ కాకుండా కిక్ సీక్వెల్ కూడా ఉంది.


Read Also : Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్


6  నెలల్లో 3 సినిమాలు 
ప్రస్తుతం తమిళ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'సికందర్'. ఈ సినిమా 2025 ఈద్ కానుకగా రిలీజ్ కాబోతుందని సల్మాన్ ఖాన్ ఏప్రిల్ 11న స్వయంగా ప్రకటించారు. అట్లీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్  అతిథి పాత్రలో కన్పించబోతున్న 'బాబి జాన్' సినిమా 2025 ప్రధమార్ధంలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ గెస్ట్ గా తెరపై కనిపించబోతున్న మరో సినిమా 'సింగం అగైన్'. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయబోతున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా డైరెక్టర్ రోహిత్ శెట్టి 'దబాంగ్ వర్సెస్ సింగం' క్రాస్ ఓవర్ ను 'సింగం అగైన్'లో చూపించి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ఏడాది నవంబర్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. మొత్తానికి వరుస సినిమాలతో సల్మాన్ తన అభిమానుల ఆకలి తీర్చబోతున్నారన్న మాట. 



Read Also ; OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్