Salman Khan's Sikindar Teaser Released: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss), బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'సికిందర్'. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకోగా.. తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. రంజాన్ సందర్భంగా 'సికిందర్' (Sikindar) థియేటర్లలోకి రానుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ రానున్నట్లు తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ నటుడు సత్యరాజ్ నెగిటివ్ రోల్‌లో చేస్తున్నారు. 'నానమ్మ అతనికి సికిందర్ అని పేరు పెట్టింది. తాత సంజయ్ అని పేరు పెట్టాడు. అయితే, ప్రజలు మాత్రం అతనికి రాజాసాబ్ అని పేరు పెట్టారు.' అనే డైలాగ్స్‌తో స్టార్ట్ అయిన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫుల్ యాక్షన్, స్టంట్స్ ఆకట్టుకుంటున్నాయి.
'న్యాయం కోసం కాదు.. సాఫ్ చేయడానికి వచ్చాను' అంటూ సల్మాన్ ఖాన్ చెప్పే డైలాగ్ వేరే లెవల్. 2023లో వచ్చిన 'టైగర్ 3' మూవీ తర్వాత సల్మాన్ ఖాన్ సోలో హీరోగా నటిస్తోన్న మూవీ సికిందర్. మురుగదాస్ రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా.. వీరి కాంబోపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మూవీని సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. సల్మాన్ గతేడాది సింగం ఎగైన్, బేబీ జాన్ చిత్రాల్లో నటించారు.