Salaar Movie Telugu Trailer : పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ‘సలార్’ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శుక్రవారం (డిసెంబర్ 1) రాత్రి 7.11 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ మూవీల తర్వాత ఎన్నో అంచనాలతో ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పైగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో ఇద్దరు స్నేహితులతో ట్రైలర్ మొదలైంది. స్నేహితుడి కోసం ఏమైనా చేసే పాత్రలో ప్రభాస్ కనిపించాడు. ‘‘నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా.. నీ ఒక్కడి కోసం. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా’’ అంటూ తన స్నేహితుడిపై ఉండే ఇష్టాన్ని స్ట్రాంగ్‌గా చూపించారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రభాస్ స్నేహితుడు. బాల్యంలోనే ఈ స్నేహితులిద్దరు విడిపోతారు. ఆ తర్వాత ఆపదలో ఉన్న పృథ్వీరాజ్.. కోసం ఒక సైన్యంలా తిరిగి వస్తాడు ప్రభాస్. ఈ సందర్భంగా ఇచ్చిన ఎలివేషన్ వీరలెవెల్‌లో ఉంది. తప్పకుండా ఈ సీన్‌కు థియేటర్‌లో విజిల్స్ పడటం ఖాయం. 


బందిపోటు సామ్రాజ్యం కథ..


ఈ కథ వెయ్యేళ్ల కిందట మొదలైంది. మహ్మద్ ఘజినీ, గెంగీస్ ఖాన్‌ల కన్నా క్రూరమైన బందిపోట్లు ఉండేవారు. ఈ బందిపోట్లు కొన్ని వందల సంవత్సరాలు ఎదురు లేకుండా ఎదిగారు. ఖాన్సార్ అనే అడవిని ఒక కోటగా మార్చుకున్నారు. ఆ ఖాన్సార్ ఒక సామ్రాజ్యమైంది. ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు జరిగేవి అంటూ జగపతి బాబు పాత్ర, పృథ్వీరాజ్ పాత్రలను పరిచయం చేశారు. ‘‘నేనుండగా నా కొడుకు వరదరాజ్ మన్నార్‌(పృథ్వీరాజ్)ను దొరగా చూడాలనేది నా కోరిక’’ అని జగపతి బాబు డైలాగ్ వస్తుంది. ఆ వెంటనే పృథ్వీరాజ్ ఎంట్రీ ఇస్తాడు. అయితే, ఇక్కడే కుట్రలు జరుగుతాయి. రాజ మన్నార్ (జగపతి బాబు).. వరద రాజ్‌కు ఆ సామ్రాజ్య బాధ్యతలు అప్పగించి వెళ్లిపోతాడు. దీంతో రాజమన్నార్ తిరిగి వచ్చే లోపు వరద రాజ్‌ను నాశనం చేయాలనే శత్రువులు కుట్ర పన్నుతారు. అలా అల్లర్లు సృష్టిస్తారు. చివరికి వరద రాజు శత్రువులకు చిక్కుతాడు. మరి, వరదరాజును ఆదుకోడానికి అతడి స్నేహితుడు తిరిగి వస్తాడు.


ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్..


వరద రాజుపై దాడి కోసం.. అతడి శత్రువులు నరాంగ్, గురంగ్‌లు రష్యా.. సెర్పిబియన్ ఆర్మీతో ఖాన్సార్ సామ్రాజ్యాన్ని చుట్టుముడతారు. దీంతో వరద రాజు కూడా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వరద రాజు దేవ పేరును చెబుతాడు. అప్పుడే ప్రభాస్ అదిరిపోయే ఎంట్రీ ఇస్తాడు. ‘‘పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి. బయటకు ఎవడు పోతాడని కాదు. లోపలికి ఎవడొస్తాడా అని’’ అనే డైలాగ్‌తో ప్రభాస్ ఎలివేషన్ సాగింది. ఫ్రెండ్‌ను ముట్టుకోకూడదనే రిక్వెస్ట్‌తో ట్రైలర్ ముగిసింది. అయితే, ఇందులో ‘కేజీఎఫ్’ను లింక్ చేస్తూ ఈశ్వరీ రావు పాత్రను చూపించనట్లు తెలుస్తోంది. చిన్నప్పుడే ప్రభాస్ తల్లితో ఖాన్సార్ నుంచి వెళ్లిపోయి కేజీఎఫ్‌లో చిక్కుకుని ఉంటారని, అక్కడ నుంచి విముక్తి పొందిన తర్వాత.. ప్రభాస్ ‘సలార్’గా ఎంట్రీ ఇస్తాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.


‘సలార్’ ట్రైలర్ ( Salaar Telugu Trailer ) :



ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply