Salaar Movie: 'సలార్‌' మేకర్స్‌ భారీ ఆఫర్‌ - టీవీలో ఈ సినిమా చూస్తూ ప్రభాస్‌ నడిపిన బైక్‌ గెలవచ్చు, ఎలా అంటే!

Salaar Movie: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్‌: సీజ్‌ ఫైర్‌' ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Continues below advertisement

Hombale Film Offer to Salaar Bike: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్‌: సీజ్‌ ఫైర్‌' (Salaar Movie) ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్‌ హిట్‌ లేని ప్రభాస్‌కు 'సలార్‌' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందింది. మొత్తం బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 700 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ రెండో భాగం షూటింగ్‌ను జరుపుకుంటుంది. థియేటర్లో సక్సెఫల్‌గా రన్‌ అయినా ఈ చిత్రం నెల రోజుల ముందే ఓటీటీకి వచ్చిన సంగతి తెలిసిందే.

Continues below advertisement

ఓటీటీలోనూ భారీ రెస్పాన్స్‌ అందుకుని అదరగొట్టింది 'సలార్‌'. ఇక ఇప్పుడు సలార్‌ టెలివిజన్‌ ప్రిమియర్‌కు వచ్చేస్తోంది. థియేటర్లో, ఓటీటీలో అలరించిన ఈ సినిమా రేపు (ఏప్రిల్‌ 22) టీవీలో ప్రసారం కానుంది. ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు స్టార్‌మాలో సలార్‌ టెలికాస్ట్‌ కానుంది.ఈ క్రమంలో ఆడియన్స్‌కి ఈ మూవీ నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్‌ (Hombale Films) బంపర్‌  ఫర్‌ ప్రకటించింది.టీవీలో సలార్‌ సినిమాను చూసి ఇందులో ప్రభాస్‌ నడిపిన బైక్‌ను గెలుచుకోవచ్చని ప్రకటించింది. తాజాగా హోంబలే ఫిలిమ్స్‌ తమ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. అంతేకాదు ఈ బైక్‌ ఎలా సొంతం చేసుకోవాలో కూడా వివరించింది.

"రేపు  సాయంత్రం 5:3౦ గంటల నుంచి 8:00 గంటల వరకు టీవీలో టెలికాస్ట్‌ అయ్యే సలార్‌ సినిమా చూస్తున్న సమయంలో మధ్య మధ్యలో ప్రభాస్‌ ఉపయోగించిన మోటర్‌ సైకిల్‌ను స్క్రీన్‌పై వస్తుంటుంది. ఆ బైక్‌ ఎన్నిసార్లు స్క్రీన్‌పై కనిపిచిందో ప్రేక్షకులు కౌంట్‌ చేయాలి. అదే సమయంలో SMS లైన్లు ప్రారంభం అవుతాయి. అప్పుడు మీరు 9222211199 నెంబర్‌కు SMS చేయాల్సి ఉంటుంది. అలా కరెక్ట్‌గా సమాధానం చెప్పిన వారికి 'సలార్‌'లో ప్రభాస్‌ నడిపిన ఈ వాహనం ఉచితంగా గెలుచుకోవచ్చు. గమనిక: SMS లైన్లు రాత్రి 8:00 మాత్రమే ప్రారంభం అవుతాయి. దీనికి షరతులు కూడా వర్తిస్తాయి." అంటూ హోంబలే ఫిలిమ్స్‌ ట్వీట్‌ చేసింది. దీంతో ప్రభాస్‌ సలార్‌ బైక్‌ను ఎలాగైన సొంతం చేసుకునేందుకు నెటిజన్లు, ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

కాగా సలార్‌ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తొలి పార్ట్‌ మంచి విజయం సాధించింది. సెకండ్‌ పార్ట్‌ను షూటింగ్‌ను త్వరగా ప్రారంభించే పనిలో ఉన్నాడట ప్రశాంత్‌ నీల్‌. ఇప్పటికే దీనిపై ఓ అప్‌డేట్‌ కూడా ఇచ్చాడు ప్రభాస్‌. 'సలార్‌: సీజ్‌ ఫైర్‌' రిలీజై హిట్‌ కొట్టిన సందర్భంగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ప్రభాస్‌ పార్ట్‌ 2 గురించి ఇలా చెప్పుకొచ్చాడు. సలార్‌ పార్ట్‌ 2కి సంబంధించి కథ ఇప్పటికే సిద్ధమైందన్నారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని, వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా చేస్తామని చెప్పాడు. పార్ట్‌ 2ని ‘సలార్‌: శౌర్యంగపర్వం’ పేరుతో తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. 

Also Read: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?

Continues below advertisement