Sailesh Kolanu about Saindhav Negative Reviews: ఈ సంక్రాంతికి ఇద్దరు సీనియర్ హీరోలు తమ సినిమాలతో సందడి చేశారు. అందులో ఒకరు ‘నా సామిరంగ’తో వచ్చిన నాగార్జున కాగా.. మరొకరు ‘సైంధవ్’తో వచ్చిన వెంకటేశ్. ఇక విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లోనే 75వ సినిమాగా తెరకెక్కింది ‘సైంధవ్’. ఇలాంటి ల్యాండ్‌మార్క్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను చేతిలో పెట్టారు ఈ సీనియర్ హీరో. ఇక ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శైలేష్ చాలా ప్రయత్నించాడని ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్‌ రియాక్షన్ వచ్చినా.. సినిమాకు మాత్రం నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. తమ సినిమాకు వస్తున్న నెగిటివ్ రివ్యూలపై శైలేష్ ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యాడు.


సక్సెస్‌ఫుల్‌గా రన్


డైరెక్టర్‌గా శైలేష్ కొలను తెరకెక్కించింది రెండు సినిమాలే.. కానీ వాటితోనే టాలీవుడ్‌లో మొదటిసారి సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ‘హిట్ 1’, ‘హిట్ 2’ చిత్రాలతో ‘హిట్‌వర్స్‌’ అనే సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేశాడు శైలేష్. ఇక తన మూడో సినిమాగా వెంకటేశ్‌తో ‘సైంధవ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. తండ్రి, కూతుళ్ల మధ్య అనుబంధాన్ని కథగా తీసుకొని.. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేశాడు. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్న ‘సైంధవ్’ సినిమాకు ఎక్కువశాతం నెగిటివ్ రివ్యూలే లభిస్తున్నాయి. ఇక ఈ విషయంపై డైరెక్టర్ శైలేష్ కొలను రియాక్ట్ అయ్యాడు.


మౌత్ టాక్‌పైనే నమ్మకం


ఏది ఏమైనా మంచి సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తుందని శైలేష్ కొలను చెప్పుకొచ్చాడు. మౌత్ టాక్‌పై తనకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సంక్రాంతికి తాము విభిన్న కథతో చిత్రాన్ని అందించామని, చాలామంది థియేటర్‌కు వెళ్లి ఈ సినిమా చూడడం ఆనందంగా ఉందని తెలిపాడు శైలేష్ కొలను.


ఇంత తక్కువ ఎక్స్‌పీరియన్స్‌తో వెంకటేశ్‌లాంటి సీనియర్ హీరోను హ్యాండిల్ చేయడం, ఫ్యామిలీ హీరోతో వైలెన్స్ చేయించడం బాగా బ్యాలెన్స్ చేశాడని ప్రేక్షకులు చెప్తున్నారు. ‘సైంధవ్’ ప్రమోషన్స్ కోసం ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడకు బైకుపై వెళ్లి.. అక్కడ థియేటర్లలో ప్రేక్షకులను కలిశాడు దర్శకుడు. 


నవాజ్ పాత్రకు ప్రేక్షకులు ఫిదా


‘సైంధవ్’లో వెంకటేశ్‌కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించగా.. రుహానీ శర్మ, ఆండ్రియా వంటి హీరోయిన్స్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్‌లో వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్ధికీ.. ‘సైంధవ్’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో నవాజ్ పాత్రకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తను స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని ఎదురుచూశారు. స్క్రీన్‌పై కనిపించినంతసేపు నవ్వుకున్నారు. ఇతర విలన్స్ పాత్రల్లో ఆర్య, ముఖేష్ రిషీ కనిపించారు. ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పాత్ర చేసింది సారా. ‘సైంధవ్’ మూవీ విడుదల అవ్వకముందే సారానే సినిమాకు స్టార్ అని వెంకటేశ్ ప్రకటించారు. ఆయన చెప్పింది పూర్తిగా నిజమే అని సినిమా చూసిన ప్రేక్షకులు భావిస్తున్నారు.


Also Read: బెదిరించి మందు తాగించారు, అది మానేశాకే ఫస్ట్ బ్రేక్ వచ్చింది - కీరవాణి