Sai Dharam Tej's Republic On Cards : సుప్రీం యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా డైరెక్టర్ దేవా కట్టా దర్శకత్వంలో 2021లో వచ్చిన పొలిటికల్ డ్రామా 'రిపబ్లిక్'. ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయినా... తెలుగులో వచ్చిన బెస్ట్ పొలిటికల్ డ్రామాల్లో ఒకటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ మూవీ సీక్వెల్ తీయబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది.
సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పారా?
ప్రస్తుతం డైరెక్టర్ దేవా కట్టా 'రిపబ్లిక్ 2' స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని... త్వరలోనే ఇది కంప్లీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. సాయి దుర్గా తేజ్‌తోనే ఈ సీక్వెల్ కూడా తెరకెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఫస్ట్ పార్ట్‌లో సాయి తేజ్ జిల్లా కలెక్టర్‌గా కనిపించారు. క్లైమాక్స్‌లో ఆయన చనిపోయినట్లు చూపించారు. కానీ సీక్వెల్ సాయి దుర్గా తేజ్‌తోనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండగా ఏ ట్విస్ట్ ఇస్తారో అనేది ఆసక్తిగా మారింది. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసే దేవా కట్టా సీక్వెల్‌లో ఎలాంటి కాన్సెప్ట్ తీసుకోనున్నారో అనేది తెలియాల్సి ఉంది. వీటిపై అఫీషియల్‌గా అటు దేవా కట్టా కానీ సాయి ధరమ్ తేజ కానీ రియాక్ట్ కావాల్సి ఉంది.
Also Read : 'మహాకాళి'గా భూమి శెట్టి - టీవీ సీరియల్స్ To మూవీస్... ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
'రిపబ్లిక్' మూవీలో సాయి ధరమ్ తేజ్‌తో పాటు ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రభుత్వ వ్యవస్థ, ప్రజలకు మంచి చేయాలనుకునే అధికారికి ఎదురైన ఇబ్బందులతో పాటు ప్రస్తుత సమాజంలో రియాలిటీకి దగ్గరగా ఎన్నో సీన్స్‌ను కళ్లకు కట్టినట్లు చూపించారు దేవా కట్టా. ముఖ్యంగా రమ్యకృష్ణ, సాయి తేజ్ మధ్య సీన్స్, డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి.
దేవా కట్టా రీసెంట్‌గానే పొలిటికల్ సిరీస్ 'మయ సభ' రూపొందించగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో... వైఎస్సార్, చంద్రబాబును పోలిన రోల్స్‌లో అదరగొట్టారు. త్వరలోనే ఈ సిరీస్ సీజన్ 2 రాబోతోంది. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సంబరాలు ఏటిగట్టు మూవీ చేస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా... పాన్ ఇండియా లెవల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.