Rajamouli's Baahubali The Epic Twitter Review : తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన 'బాహుబలి' రెండు పార్టులను కలిపి ఒకే మూవీ 'బాహుబలి ది ఎపిక్'గా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓవర్సీస్‌లో షోస్ ప్రారంభం కాగా... ఇండియాలో గురువారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేయనున్నారు. సోషల్ మీడియా వేదికగా 'బాహుబలి' సందడి నెలకొంది. మూవీ చూసిన ఓవర్సీస్ ఆడియన్స్ నెట్టింట పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు.

Continues below advertisement


విజువల్ వండర్... బెస్ట్ ఎక్స్‌పీరియన్స్


'బాహుబలి ది ఎపిక్' విజువల్ వండర్ అని అంటున్నారు. ఇప్పటివరకూ చూడని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ రాజమౌళి అందించారని... బాహుబలి ఎంట్రీ సీన్‌తో పాటు శివుని ఎంట్రీ... భళ్లాలదేవుని ఎంట్రీ వేరే లెవల్ అని అంటున్నారు. ఐమాక్స్‌లో మూవీ ఎక్స్‌పీరియన్స్ గూస్ బంప్స్ అని చెబుతున్నారు. ఇలాంటి బీజీఎం ఎలివేషన్ ఫస్ట్ టైమే పెట్టుంటే ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ అంటూ కామెట్స్ చేస్తున్నారు. 














ఐమాక్స్‌లో మూవీ చూస్తుంటే ఆ ఎక్స్‌పీరియన్స్ వర్ణించలేమని ఓ ఓవర్సీస్ ఫ్యాన్ పోస్ట్ చేశారు. థియేటర్లో సగం ఆడియన్స్ నాన్ ఇండియన్స్ ఉన్నారని... ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆస్వాదించారని తెలిపారు. ప్రభాస్, రానా ఎంట్రీ టైంలో చైర్లో కూర్చోలేనట్లుగా సీన్స్ ఉన్నాయని చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 






మహేష్ కుమారుడి రివ్యూ


ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ సైతం మూవీని చూసి రివ్యూ ఇచ్చారు. మూవీ అద్భుతంగా ఉందని... ఓ సరికొత్త అనుభూతిని పంచిందని చెప్పారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు రెండేళ్లు వెయిట్ చేయాల్సిన పని లేదని సరదాగా కామెంట్ చేశారు. 'బాహుబలి ది ఎపిక్' ఎక్స్‌పీరియన్స్ వేరే లెవల్ అని అన్నారు.


Also Read : బాలయ్య రుద్ర తాండవం... డివోషనల్ బీజీఎం వేరే లెవల్ - తమన్ ఆన్ డ్యూటీ