రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'సప్త సాగరాలు దాటి' గుర్తు ఉందా? ఒకవేళ ప్రేక్షకులు ఎవరైనా సరే ఆ సినిమా మరిచిపోయినా... హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ను మాత్రం మర్చిపోలేరు. అభినయంతో పాటు ఆవిడ అందం అంతగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆవిడ చేతిలో ఉన్న సినిమాలలో 'కాంతార' (Kantara Prequel) ప్రీక్వెల్ ఒకటి.

కనకవతిగా రుక్మిణీ వసంత్!రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'కాంతార' పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఆ సినిమాకు ప్రీక్వెల్ 'కాంతార ఏ లెజెండ్' (Kantara A Legend Chapter 1) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో రుక్మిణి వసంత్ హీరోయిన్. కనకవతి పాత్రలో ఆవిడ నటిస్తున్నట్లు తెలియజేయడంతో పాటు ఇవాళ ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Also Read: 'అరేబియా కడలి' రివ్యూ: 'తండేల్' కథే... మరి ఈ సిరీస్‌లో కొత్తేముంది? క్రిష్ & కో చూపించిన ఎమోషన్ ఏంటి?

కాంతార ప్రీక్వెల్ షూటింగ్ పూర్తి'కేజిఎఫ్', 'సలార్', 'కాంతార'తో పాటు రీసెంట్ 'మహావతార్: నరసింహ' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ప్రొడ్యూస్ చేసిన హోంబలే ఫిలిమ్స్ ఈ 'కాంతార ఏ లెజెండ్' ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

Also Read'మయసభ' వెబ్ సిరీస్ రివ్యూ: చంద్రబాబుకు ప్లస్సా? లేదా వైయస్సార్ & వైసీపీకి ప్లస్సా? ఓటీటీలో దేవాకట్టా రాజకీయ మాయాజాలం ఎలా ఉందంటే?

ఏడు భాషల్లో సినిమా విడుదల!Kantara Chapter 1 Release Date: అక్టోబర్ రెండన 'కాంతార: చాప్టర్ 1' విడుదల చేయనున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. గాంధీ జయంతికి థియేటర్లలో సినిమా సందడి చేయనుంది. సాధారణంగా పాన్ ఇండియా రిలీజ్ అంటే హిందీతో పాటు దక్షిణాది నాలుగు భాషల్లో విడుదల చేస్తారు. కానీ ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ హిందీ భాషలలో మాత్రమే కాదు... ఇంగ్లీష్, బెంగాలీలోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు.